ప్రేమించడం లేదని క్లాసులోనే కొట్టి చంపేశాడు.. ఆపై..

Uday Kumar killed Sonali for not loving him

04:47 PM ON 3rd September, 2016 By Mirchi Vilas

Uday Kumar killed Sonali for not loving him

పైశాచికత్వం రాజ్యమేలుతుంది. అబ్బాయిలు కీచకుల్లా మారి అమ్మాయిలపై విరుచుకు పడుతున్నారు. తాజాగా ఒక దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆ వివరాల్లోకి వెళితే.. దారుణ హత్యకు గురైన స్వాతి ఉదంతం మర్చిపోకముందే తమిళనాడులో మరో ఘోరం చోటుచేసుకుంది. కరూర్ లోని ఓ ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీలో చదువుతున్న సోనాలిపై ఉదయ్ కుమార్ అనే యువకుడు దాడి చేసి అత్యంత కిరాతకంగా చంపేశాడు. సోనాలి క్లాస్ రూమ్ లో పాఠాలు వింటుండగా అక్కకు వచ్చిన ఉదయ్ కుమార్ విద్యార్ధులు, ప్రొఫెసర్ సమక్షంలోనే దుడ్డుకర్రతో సోనాలి తలపై కొట్టి పరారయ్యాడు.

ఘటన నుంచి తేరుకుని ఆమెను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆమె మరణించింది. నిందితుడు ఉదయ్ కుమార్ ఇటీవలే కాలేజీ నుంచి సస్పెండ్ అయ్యాడని తెలుస్తోంది. అతని ప్రేమను తిరష్కరించడం వల్లనే ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని సహచర విద్యార్దులు చెపుతున్నారు.

ఇది కూడా చదవండి: మీ గోళ్లపై పసుపుపచ్చ మచ్చలు ఉన్నాయా? అయితే ఇలా చేస్తే తొలగిపోతాయి..

ఇది కూడా చదవండి: ఒంటిమీద చీరను విప్పి ముగ్గురు ప్రాణాలను కాపాడింది!

ఇది కూడా చదవండి: వినాయక చవితికి 21 పత్రాలతో పూజ.. నిమజ్జనం వెనుక అసలు కధ తెలుసా?

English summary

Uday Kumar killed Sonali for not loving him