స్మాల్ స్క్రీన్ పై రీ ఎంట్రీ ఇస్తున్న ఉదయభాను..!

Udaya Bhanu is giving re entry as a anchor

12:22 PM ON 8th November, 2016 By Mirchi Vilas

Udaya Bhanu is giving re entry as a anchor

బుల్లితెరపై వ్యాఖ్యాతగా, వెండితెరపై నటీమణిగా రెండు దశాబ్ధాలుగా తెలుగు ప్రేక్షకుల్ని అలరిస్తూనే ఉన్న ఉదయభాను. స్మాల్ స్క్రీన్ పై యాంకర్ గా సంచలనం సృష్టించిన ఈ బ్యూటీ.. కాస్త గ్యాప్ తర్వాత మళ్లీ తెరపైకి రాబోతోంది. ఇటీవలే ఇద్దరు కవలలకు జన్మనిచ్చిన ఆ యాంకర్ కమ్ యాక్ట్రెస్ ఇప్పుడు మరోసారి మేకప్ వేసేసింది. స్మాల్ స్క్రీన్ పై ఉదయభాను వ్యాఖ్యాతగా వ్యవహరించిన 'హృదయాంజలి', 'ఒన్స్ మోర్ ప్లీజ్', 'సాహసం చెయ్యరా డింభక', 'ఢీ', 'నీ ఇల్లు బంగారం కానూ', 'జానవులే నెర జానవులే' వంటి పలు షోస్ ఫుల్ పాపులర్ అయ్యాయి. ఇవే కాకుండా అగ్ర తారల సినిమాల ఆడియో రిలీజ్ వేడుకల్లోనూ యాంకర్ గా దుమ్మురేపింది.

యాంకర్ గా తనకంటూ ప్రత్యేక శైలిని ఏర్పాటు చేసుకుని కొన్ని కార్యక్రమాలకు తను తప్ప వ్యాఖ్యాతగా మరెవరూ న్యాయం చేయలేరు అన్న రీతిలో స్మాల్ స్క్రీన్ పై సంచలనం సృష్టించిన ఉదయభాను. మరోవైపు వెండితెరపై అడపా దడపా సినిమాల్లో నటిస్తూ కొన్ని ఐటెమ్ నంబర్స్ లో అలరిస్తూ వచ్చింది. స్నేహితుడు విజయ్ ను పెళ్లి చేసుకుని గత సెప్టెంబర్ లో కవలలకు జన్మనిచ్చిన ఉదయభాను, కొన్ని రోజులు మేకప్ కు బ్రేక్ ఇచ్చి న సంగతి తెల్సిందే. మళ్లీ ఇప్పుడు షోస్, సినిమాలతో బిజీ కానుంది. ఇటీవల చాలా రోజుల తర్వాత మరోసారి మేకప్ వేసింది ఉదయభాను. మరి భాను మళ్లీ మునుపటి హవాను కొనసాగిస్తుందా లేదా అన్నది వేచి చూడాలి.

English summary

Udaya Bhanu is giving re entry as a anchor