రూమర్స్ పై ఉదయభాను సీరియస్...

Udaya Bhanu serious on rumours

04:26 PM ON 29th August, 2016 By Mirchi Vilas

Udaya Bhanu serious on rumours

ఈమధ్య వరకూ యాంకరింగ్ తో అదరగొట్టి సినిమాల్లో కూడా వేషాలు వేసి, ఇటు బుల్లితెర అటు వెండితెర పై మెరుపులు మెరిపించి కొంతకాలంగా దూరంగా ఉంటున్న ఉదయభానుపై వస్తున్న రూమర్స్ కి ఆమెకు కోపం వచ్చింది. తన గురించి రూమర్లు పుట్టించేవాళ్లపై.. విమర్శలు గుప్పించేవాళ్లపై ఉదయభాను మండి పడింది. ఎంటర్టైన్మెంట్ ఫీల్డులో వున్నప్పుడు మన గురించి చాలా మంది చాలా అనుకుంటారని.. వాటన్నింటినీ పట్టించుకుంటే బతకలేమని అని చెప్పిన ఉదయభాను. ప్రెగ్నెన్సీ వల్ల కొంత కాలంగా లైమ్ లైట్లో లేదు. ఇంకో వారం పది రోజుల్లో కవలలకు జన్మనివ్వబోతున్నట్లు ఓ ఇంటర్వ్యూలో చెబుతూ, రూమర్లపై కూడా స్పందించింది.

1/5 Pages

1. కుక్కలెన్ని మొరిగినా...


ఎంటర్టైన్మెంట్ ఫీల్డులో అమ్మాయిల పరిస్థితి అద్దాల ఇంట్లో ఉన్నట్లు ఉంటుంది. ఎవరైనా మనమీదికి రాయి విసరొచ్చు. మనల్ని మనం కాపాడుకోవాలి, తట్టుకోవాలి, పోరాడాలి. ఈ రంగంలో సానుకూలతలు ఉంటాయి. ప్రతికూలతలూ ఉంటాయి. ఇక్కడికి రావడం ఒక రకంగా శాపం.. ఇంకో రకంగా వరం. డబ్బు.. పేరు.. రూమర్లు.. అన్నీ వస్తాయి. సక్సెస్ లో ఉన్నవాళ్లను చూస్తే ఒక రాయి విసరకుండా ఉండలేరు జనాలు. కానీ వాళ్ల గురించి నేను పట్టించుకోను.

'గుడిలో ఉండే దేవతను చూసి వీధిలో కుక్కలు మొరుగుతూ ఉంటాయి. వాటి వల్ల దేవత గొప్పదనం పడిపోదని' నా ఫ్రెండొకరు చెప్పారు. అది నిజం. ముఖ్యంగా అమ్మాయిల విషయంలో ఇది ఎక్కువగా జరగుతుంది అని ఉదయభాను చెప్పుకొచ్చింది.

English summary

Udaya Bhanu serious on rumours. Udaya Bhanu responds on rumours.