'ఉడ్తా పంజాబ్' కు 13 కట్స్

Udta Punjab Got A Certificate

10:41 AM ON 13th June, 2016 By Mirchi Vilas

Udta Punjab Got A Certificate

విచ్చలవిడిగా మాదకద్రవ్యాల వినియోగం, పంజాబ్ యువతపై దాని ప్రభావం ప్రధాన ఇతివృత్తంగా రూపొందిన బాలీవుడ్ చిత్రం 'ఉడ్తా పంజాబ్' సెన్సార్ వివాదం నుంచి మోక్షం లభించింది. ఎట్టకేలకు సెన్సార్ క్లియరెన్స్ లభించింది. 13 కట్స్ తో 'ఎ' సర్టిఫికెట్ ఇచ్చారు. ఈ చిత్రం రూపొందింది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సిఎఫ్ బిసి) ఈ చిత్రానికి భారీ కట్స్ చెప్పడంతో వివాదం చెలరేగింది. 89 కట్స్ తో పాటు, టైటిల్ లో పంజాబ్ అనే పదాన్ని తొలగించాలని సిఎఫ్ బిసి డిమాండ్ చేయడంతో నిర్మాతలు కోర్టును ఆశ్రయించారు. కాగా, టైటిల్ నుంచి పంజాబ్ అనే పదాన్ని తొలగించాలని ఫిల్మ్ సర్టిఫికేషన్ బోర్డు అడగలేదని సిఎఫ్ ఎఫ్ సి చీఫ్ పహ్లాజ్ నిహలానీ వివరణ ఇచ్చారు. "'ఎ సర్టిఫికెట్ తో సినిమాకు క్లియరెన్స్ ఇచ్చాం. సినిమా టైటిల్ విషయంలో నిర్మాత అబద్ధాలు చెప్పారు. పంజాబ్ పదాన్ని తొలగించాలని మేము ఎప్పుడూ కోరలేదు. కేవలం పబ్లిసిటీ కోసమే నిర్మాత మీడియా ముందు ఈ విషయం చెప్పారు. నిర్మాత వాదన పూర్తిగా సత్యదూరం'' అని నిహలానీ తెలిపారు. సినిమాలో 13 కట్స్ ను బోర్డు సిఫారసు చేసిందని, ఆ కట్స్ లో సంభాషణలను తొలగించిన తర్వాత రిలీజ్ కు క్లియరెన్స్ ఇచ్చినట్టు చెప్పారు. 'ఉడ్తా పంజాబ్' చిత్రానికి అభిషేక్ చౌబే దర్శకత్వం వహించగా, షాహిద్ కపూర్, కరీనా కపూర్, అలియా భట్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈనెల 17 సినిమా విడుదలకానుంది.

ఇవి కూడా చదవండి:ఇది అందరి దౌర్భాగ్యం..దర్శకరత్న షాకింగ్ కామెంట్స్

ఇవి కూడా చదవండి:'శాతకర్ణి'పై రాజమౌళి ఏమన్నాడంటే ..

English summary

Controversial Film Udta Punjab was came into news with some controversies and now this film got A certificate by the Censor Board with 13 cuts in the movie.