ఉజ్జయిని కుంభమేళా -  పోటెత్తిన భక్తజనం

Ujjain Kumbh Mela 2016

11:44 AM ON 7th May, 2016 By Mirchi Vilas

Ujjain Kumbh Mela 2016

మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో జరుగుతున్న సింహస్థ కుంభమేళాకు భక్తులు పోటెత్తారు. భక్తులు, సాధువులు పుణ్యస్నానాలు ఆచరించారు. భారీ వర్షాల కారణంగా ఉజ్జయినిలో గురువారం ప్రమాదం సంభవించి, భక్తుల కోసం ఏర్పాటు చేసిన టెంట్లు, తాత్కాలిక పందిళ్లు ఈదురుగాలుల కారణంగా కుప్పకూలిపోయాయి. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందగా, 90 మందికి పైగా భక్తులు గాయపడ్డారు. ఈ ప్రమాదాన్ని దృష్టిలో ఉంచుకొని మేళా నిర్వాహకులు శుక్రవారం తగు జాగ్రత్తలు తీసుకున్నారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేశారు. దీంతో ఇబ్బందులు తొలగాయి. గత నెల 22న ప్రారంభమైన కుంభమేళా ఈనెల 21 వరకు జరగనుంది. 12 ఏళ్లకు ఒకసారి జరిగే ఈ మేళాకు దేశం నలుమూలల నుంచి భక్తులు వస్తారు. ఉజ్జయినిలో దేశంలోని 12 జ్యోతిర్లింగాల్లో ఒకటైన మహాకాళేశ్వరుడి ఆలయం ఉంది. ఈ ఏడాది జరిగే కుంభమేళాలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు 5 కోట్ల మంది భక్తులొస్తారని అంచనా. ప్రధాని మోడీ కూడా కుంభమేళా కు హాజరై పుణ్య స్నానం ఆచరించారు.

ఇవి కూడా చదవండి:

ద్రోణ - అర్జున - భీమ.. భలే కాంబినేషన్

ఈ నెల 9న ఆకాశంలో అద్భుతం!

English summary

Ujjain Kumbh Mela 2016 was started in Ujjain and due to heavy storms 7 people were died in 90 people were injured.