అల్ట్రా షీల్డ్ తో ఫుల్ సేఫ్టీ

Ultra Sheild Phone Security App

04:58 PM ON 11th December, 2015 By Mirchi Vilas

Ultra Sheild Phone Security App

ప్రస్తుతం ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ల వినియోగం పెరిగింది. కాల్స్, మెసేజ్ ల కోసమే కాకుండా ఫొటోలు, వీడియోలు ఇలా అనేక రకాలుగా స్మార్ట్ ఫోన్లను వాడేస్తున్నారు. అయితే స్మార్ట్ ఫోన్లను ఉపయోగించడం ఎంత ముఖ్యమో వాటిని సురక్షితంగా ఉంచుకోవడం కూడా కీలకమే. ఈ నేపథ్యంలోనే సెక్యూరిటీ సాఫ్ట్‌వేర్లను అందించే సంస్థలు కొత్త కొత్త యాప్‌లను విడుదల చేస్తున్నాయి. తాజాగా మాస్టర్ షీల్డ్ కంపెనీ విడుదల చేసిన అల్ట్రా షీల్డ్ యాప్ ఇదే కోవకు చెందుతుంది. ఆండ్రాయిడ్ యూజర్లకు ఈ యాప్ గూగుల్ ప్లే స్టోర్‌లో లభ్యమవుతోంది. కేవలం 2.7 ఎంబీ సైజ్ మాత్రమే ఉండే ఈ యాప్ డివైస్‌ను ఎప్పటికప్పుడు వైరస్‌ల బారి నుంచి రక్షిస్తుంది. ఆండ్రాయిడ్ 4.0 ఆ పైన ఓఎస్ వెర్షన్ ఉన్న వినియోగదారులు దీన్ని ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. ఒకే ఒక్క టచ్ తో ఈ యాప్ ద్వారా డివైస్ మొత్తాన్ని స్కాన్ చేసుకునేందుకు వీలుంది. యూజర్లు సులభంగా ఉపయోగించుకునేలా దీన్ని రూపొందించారు. ఫోన్ ఇంటర్నల్ మెమోరీనే కాకుండా ఎస్‌డీ కార్డ్ మెమోరీని కూడా దీని ద్వారా స్కాన్ చేసి వైరస్‌లను తొలగించుకోవచ్చు.

English summary

A new smart phone application named Ultra sheild app which your smart phone from virus and Scan Entire System with 1-Click, Clearing All Threats