ఫీజు కట్టలేక కూతురికి విషం ఇచ్చేసింది .. తానూ తాగేసింది ..

Unable to pay school fee mother poisons daughter

02:58 PM ON 8th June, 2016 By Mirchi Vilas

Unable to pay school fee mother poisons daughter

నిజమే అందరికీ విద్య అన్నది నినాదాలకే పరిమితం అయింది. పిల్లల్ని మంచి స్కూల్లో చదివించాలంటే, తట్టుకోలేని రీతిలో ఫీజుల్ స్త్రక్తర్ ఉంటోంది. దీంతో చాలామంది తల్లిదండ్రులు ఫీజులు కట్టడానికి నరకయాతన పడుతున్నారు. అయితే ఓ తల్లి పాఠశాల ఫీజు కట్టలేక కన్నకూతురికే ఏకంగా విషం పెట్టి తానూ ఆత్మహత్య చేసుకోవాలనుకుంది. ఈ విషాద ఘటన కోయంబత్తూర్ లో చోటుచేసుకుంది. తిరుపూర్ జిల్లాకి చెందిన జోషిక(8) రెండో తరగతి చదివింది. ఆమె తండ్రి భూపతి మూడేళ్ల క్రితం రూ.3లక్షలు అప్పు చేసి మలేషియాలో టైలరింగ్ షాపు పెట్టుకున్నాడు.

తల్లి యమున బ్యూటీషియన్ గా పనిచేస్తోంది. రోజంతా కష్టపడినా ఇంటికి సరిపోయేంత డబ్బు వచ్చేది కాదు. దీంతో భర్త సంపాదన మీదే ఆధారపడుతోంది. భూపతి పంపిన డబ్బు అప్పు తీర్చడానికే సరిపోయేది. ఇంతలో జోషికకు పాఠశాల తెరిచారు. మూడో తరగతికి రూ. 40 వేలు ఫీజు కట్టాలని యాజమాన్యం చెప్పడంతో యమున అది కట్టలేక కూతుర్ని చదువు మాన్పించింది. కానీ ఈ విషయంపై మానసికంగా తీవ్ర ఆవేదనకు లోనైన యమున కూతురితో సహా ఆత్మహత్య చేసుకోవాలనుకుంది. పురుగుల మందు కలిపిన నీళ్లు పిల్ల చేత బలవంతంగా తాగించి, తానూ తాగేసింది. ఇది గమనించిన స్థానికులు ఇద్దరినీ తిరుపూర్ లోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే జోషిక చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. యమునను మెరుగైన చికిత్స కోసం వేరే ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగానే వుందట. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇది కూడా చూడండి:జూన్ 8న ఏం జరిగాయంటే ...

ఇది కూడా చూడండి:ఈ ప్రదేశాల్లో శృంగారంలో పాల్గొంటే సమస్యలను కొని తెచ్చుకున్నట్టే!

ఇది కూడా చూడండి:ఐపీఎల్ లో మన క్రికెటర్లు ఒక్క రన్ కి ఎంత సంపాదించారో తెలుసా?

English summary

Mother B Yamuna Devi, was asked to pay school fee of Rs 40,000 for the third standard. But she was unable to arrange the amount.