ఫిలింనగర్ లో ఓ భవనం ఇలా కుప్ప కూలింది

Under construction building collapsed in film nagar

10:30 AM ON 25th July, 2016 By Mirchi Vilas

Under construction building collapsed in film nagar

అవును, హైదరాబాద్ ఫిలింనగర్ కల్చరల్ క్లబ్ వద్ద నిర్మాణంలో వున్న ఓ భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో ఇద్దరు కూలీలు స్పాట్ లో మృతి చెందగా, మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని బయటకు తీసి సమీపంలోని అపోలో ఆసుపత్రికి తరలించారు. నిర్మాణంలో వున్న భవనాన్ని విస్తరించే క్రమంలో 10 పిల్లర్స్ కూలడంతో ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటన జరిగిన టైమ్ లో శ్లాబు పనుల్లో 16 మంది కూలీలున్నట్లు చెబుతున్నారు. శిథిలాల తొలగింపు పనులు వేగంగా కొనసాగుతున్నాయి. మరోవైపు ఈ భవన నిర్మాణం సుమారు రెండునెలల నుంచి జరుగుతున్నట్లు స్థానికులు తెలిపారు.

కల్చరల్ క్లబ్ వద్ద నిర్మిస్తున్న భవనాన్ని అనుమతులు లేవని జీహెచ్ఎంసీ అసిస్టెంట్ కమీషనర్ అంటున్నారు. పైగా ఆ స్థలం కోర్టు వివాదంలో ఉన్నట్లు కూడా టాక్ నడుస్తోంది. ఈ లెక్కన దాని నిర్మాణం ఎలా జరుగుతుంది? దీనివెనుక బడా వ్యక్తులు ఎవరైనా వున్నారా? అనేది తేలాల్సివుందని అంటున్నారు. ఏ పుట్టలో ఏ పామున్నదో కదా.

English summary

Under construction building collapsed in film nagar