అండర్ వాటర్.. మ్యూజియం

Underwater Museum under the Atlantic ocean

09:37 AM ON 6th February, 2016 By Mirchi Vilas

Underwater Museum under the Atlantic ocean

మ్యూజియం.. అరుదైన, అపురూపమైన వస్తువులు భద్రపరిచే చోటు. సాలార్ జంగ్ మ్యూజియం లాంటివి మనకు తెలిసిందే. కానీ ఈ మ్యూజియం మాత్రం కాస్త వెరైటీ. ఇందులోకి వెళ్లాలంటే సూట్ వేసుకోవాల్సిందే. సూట్ అంటే మామూలుగా వేసుకునే సూట్ కాదు.. స్విమ్మింగ్ సూట్. ఎందుకంటే.. ఈ మ్యూజియం ఉంది సముద్రగర్భంలో మరి. అలల మధ్యలోంచి సముద్ర గర్భంలోకి వెళ్లి.. నీలి కిరణాల వెలుగులో చేయితిరిగిన శిల్పి తీర్చిదిద్దిన శిల్పాలు ఇక్కడ కనువిందు చేస్తున్నాయి. యూరోప్ లో మొట్టమొదటి అండర్ వాటర్ మ్యూజియం ఇదే. దీని పేరు అట్లాంటిక్‌ మ్యూజియం. సముద్ర గర్భంలోని పర్యావరణాన్ని కాపాడేందుకు, పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు వీలుగా స్పెయిన్‌లోని లాంజరోట్‌లో ఉన్న సముద్రంలో ప్రముఖ బ్రిటిష్‌ శిల్పి జాసన్‌ డికెయిర్స్‌ టేలర్‌ దీనిని రూపొందించారు. ఇదీ సముద్ర మట్టానికి 12 మీటర్ల లోతులో ఉంటుంది. ఆయన చెక్కిన 400 శిల్పాల్ని సముద్ర గర్భంలో 2,500 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఏర్పాటు చేశారు. టేలర్‌ అంతకు ముందు కూడా ఇలా సముద్ర గర్భ మ్యూజియంలను ఏర్పాటు చేశారు. అయితే ఐరోపా ఖండంలో ఇలాంటిది ఇదే మొదటిది కావడం విశేషం. డైవింగ్‌ వచ్చిన వారెవరైనా సముద్ర లోతుల్లోకి వెళ్లి ఆ మ్యూజియంని చూడవచ్చు. అంతే కాకుండా ఆ మ్యూజియం ఉన్న ప్రాంతంలో బయోమాస్‌ని పెంచి అక్కడున్న జీవ జాతులన్నింటికీ దాన్ని బ్రీడింగ్‌ కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తున్నారు. అలా సముద్రం లోపల చక్కటి పర్యావరణాన్ని తయారు చెయ్యాలన్నదీ.. వారి ఆలోచన.

English summary

The Cancun Underwater Museum is the worlds most famous underwater sculpture museum..This is the first museum to be built under the Atlantic ocean.The Atlantic Museum, based on the seafloor of Las Coloradas bay, has begun installing a set of sculptures by international artist Jason deCaires Taylor inspired by "the defense of the ocean.