కేంద్ర బడ్జెట్ ఏం చెప్పింది ...

Union Budget 2016

11:03 AM ON 1st March, 2016 By Mirchi Vilas

Union Budget 2016

కేంద్రంలో బిజెపి సారాధ్యంలోని ఎన్డిఎ ప్రభుత్వం ఏర్పడ్డాక మరో ఆర్ధిక సంవత్సరానికి బడ్జెట్ వచ్చేసింది. 2016-17 సాధారణ బడ్జెట్‌ను కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ సోమవారం పార్లమెంటులో ప్రవేశపెట్టారు. ప్రపంచమంతా ఆర్థిక మందగమనంలో ఉన్న సమయంలో తాను బడ్జెట్‌ ప్రవేశపెడుతున్నానని, భారత ఆర్థిక వ్యవస్థ బలంగా ఉందని జైట్లీ తన బడ్జెట్‌ ప్రసంగంలో పేర్కొన్నారు. తాము సవాళ్లను అవకాశాలుగా మలుచుకున్నట్లు జైట్లీ తెలిపారు. ద్రవ్యోల్బణం 9శాతం నుంచి 5.4 శాతానికి తగ్గిందన్నారు. భారత్‌ 7.6 శాతం వృద్ధిరేటు నమోదు చేసినట్లు ఆయన వెల్లడించారు.

బడ్జెట్ హైలైట్స్ ఇప్పుడు చూద్దాం...

1/13 Pages

వ్యవసాయ రంగానికి 35,985 కోట్లు ...


 ప్రభుత్వం కొత్తగా తెస్తున్న ప్రధాని పంటల భీమా యోజన రైతులకు భరోసా ఇవ్వనుందని బడ్జెట్ లో ప్రస్తావించారు.  గ్రామీణ, కీలక రంగాలకు అదనపు వనరులు సమకూర్చా మని కేంద్రమంత్రి జైట్లీ చెప్పుకొచ్చారు. వ్యవసాయ రంగానికి 35,985 కోట్లు కేటాయింపు చేసారు. ప్రధానమంత్రి సించాయి యోజన ద్వారా అదనంగా 28.5లక్షల హెక్టార్లుకు సాగునీరు అందించాలని లక్ష్యంగా నిర్ణయించారు. గ్రామీణ, వ్యవసాయ, బ్యాంకింగ్‌ రంగాలకు ఆర్థిక దన్ను ఇస్తామని బడ్జెట్ లో ప్రకటించారు.

English summary

Here is the Highlights of the India Union Budget for the year 2016-2017.This budget was announced by Finance Minister of India Arun Jaitley in Parliament.