ఏపీకి ప్యాకేజీ ... భగ్గుమన్న సోషల్ మీడియా

Union Minister Arun jaitley MidNight Press Meet About Andhra Pradesh Special Package

10:55 AM ON 8th September, 2016 By Mirchi Vilas

Union Minister Arun jaitley MidNight Press Meet About Andhra Pradesh Special Package

మనదేశానికి అర్ధరాత్రి స్వాతంత్య్రం వచ్చింది. కానీ ఏపీకి ప్రత్యేక హోదాయా , ప్యాకేజీయా అనే విషయం కూడా అర్ధరాత్రే తేలింది. దీనిపై సోషల్ మీడియాలో పలువురు భగ్గుమన్నారు. ముఖ్యంగా ఏపీకి ఐదేళ్లు కాదు. పదేళ్లు హోదా కావాలంటూ సాక్షాత్తూ కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్ చేసే మాటలు, ఈనాడు ఏమయ్యాయి? ఆనాడు సభలో ప్రధాని ఇచ్చిన మాటకే విలువలేనప్పుడు, ఇప్పుడు ప్యాకేజీ అంటూ మంత్రులు చేయనున్న ప్రకటనలకు విలువ వుంటుందా? హోదాతో సమానంగా ప్యాకేజ్ ఇస్తామంటూ కేంద్రం చేస్తున్న ప్రకటనలు ప్రజలను మభ్యపెట్టే గారడి తప్ప మరేమికాదని దుమ్మెత్తిపోస్తున్నారు. బుధవారం ఉదయం నుంచి అర్ధరాత్రి వరకూ సాగిన ఏపీకి ప్రత్యేక హోదా / ప్యాకేజీ హైడ్రామాకు అర్ధరాత్రి సమయంలో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తెరదించారు. కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు తో కలిసి మీడియాముందుకు వచ్చిన అరుణ్ జైట్లీ ప్రత్యేక హోదా లేదు అది అడగడంలో న్యాయం ఉంది కానీ.. తాము ఇవ్వలేమని చెప్పకనే చెబుతూ.. ప్యాకేజీ వివరాలను ప్రకటించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలని పార్లమెంట్ వేదికగా ఇచ్చిన హామీపై గడిచిన రెండున్నరేళ్లుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దాగుడుమూతలాడుతుండగా బుధవారం రాత్రి 11 గంటల ప్రాంతంలో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మీడియా సమావేశం ఏర్పాటు చేసి అసలు విషయాన్ని తేల్చేసారు. ప్రత్యేక హోదా సాధ్యం కాదని, దానికి ప్రత్యామ్నాయంగా ప్రత్యేక ప్యాకేజీ సిద్ధం చేసినట్టు వెల్లడించారు.

విభజన కారణంగా ఆంధ్రప్రదేశ్ ఆదాయాన్ని కోల్పోయింది. ఈ విషయంలో హోదా కాకుండా సాయం మాత్రం చేస్తాం అని జైట్లీ ప్రకటించారు. విభజన చట్టంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఆ మేరకు ఆయా శాఖల మంత్రులు ప్రకటనలు చేస్తారని సెలవిచ్చారు. పోలవరానికి 100% నిధులను కేంద్రమే సమకూరుస్తుందన్నారు.

ఇది కూడా చూడండి: ఆడవాళ్ళకు ఎక్కువగా వచ్చే కల ఏమిటో తెలుసా?

' రెవెన్యూ లోటును భర్తీ చేయడంకోసం 2014-15 ఆర్థిక సంవత్సరంలో ఏపీకి 3979.5 కోట్ల రూపాయలు ఇప్పటికే ఇచ్చాం. వెనుక బడిన ప్రాంతాల అభివృద్ధి కోసం 1050 కోట్లు అంద జేశాం. వీటితో పాటు పలు కేంద్ర ప్రభుత్వ సంస్థలను నెలకొల్పాం. అప్పటి ప్రధాని ఇచ్చిన ప్రతి హామీ ఈ ప్రత్యేక ప్యాకేజీ ద్వారా నెరవేరుతుంది. 14వ ఆర్థిక సంఘం నివేదిక ప్రకారం ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఉండదు. రైల్వే జోన్ పై సురేష్ ప్రభు ప్రకటన చేస్తారు' అని ఆయన ప్రకటించారు.

ఇది కూడా చూడండి: కలియుగాంతంలో మనుషుల ప్రవర్తన ఇలా ఉంటుందట

ఇక కేంద్రం ఆంధ్రప్రదేశ్ కు ప్యాకేజీ ఇస్తామంటూ వచ్చిన వార్తలపై సోషల్ మీడియా ఒక్కసారిగా భగ్గుమంది. రాష్ర్టానికి ప్రత్యేక హోదా కాకుండా మరి ఏది ఇచ్చినా సరే గొంతు కోసినట్లేనని నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఇకపై ఏ రాష్ర్టానికీ ప్రత్యేక హోదా ఇచ్చేది లేదంటూ ఇంతకుముందు వచ్చిన వార్తలపై కూడా విమర్శలు వెళ్లువెత్తుతున్నాయి. రాష్ర్టానికి ప్రత్యేకహోదా ఇస్తామంటూ పదేపదే ఎన్ని్కల వాగ్దానం చేసిన మోదీ ఇప్పుడు నాలిక మడతపెట్టేయడంపైనా వాళ్లు ఆగ్రహావేశాలు వ్యక్తంచేస్తున్నారు.

ఇది కూడా చూడండి: నిద్రలో ఉన్నప్పడు పడిపోతున్నామనే భావన ఎందుకు కలుగుతుంది?

అధికారంలోకి వచ్చేముందు రకరకాల వాగ్దానాలు గుప్పించిన బీజేపీ నేతలు, అధికారంలోకి వచ్చాక రకరకాల ప్రకటన చేయడంపై రుసరుసలాడుతున్నారు. అటు పురందేశ్వరిపైనా కూడా మండిపడుతున్నారు. ఆనాడు కాంగ్రెస్ లో వుండి అడ్డగోలుగా విభజించినప్పుడు ఈ మాటలు ఏమయ్యాయని, ఇప్పుడు హోదా కంటే ప్యాకేజీతో ఎన్నో ప్రయోజనాలు వస్తాయని చెప్పడం మభ్యపెట్టడమేనని ప్రశ్నిస్తున్నారు. విభజన చట్టంలోని హామీల్ని పూర్తిగా నెరవేరుస్తామంటూ మాజీ ప్రధాని మన్మోెహన్ సింగ్ ప్రకటించగా, ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన బీజేపీ, ఇప్పుడిలా సన్నాయినొక్కులు నొక్కడంపైనా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

English summary

Union Minister Arun jaitley MidNight Press Meet About Andhra Pradesh Special Package.