ఎయిర్ హోస్టెస్ - కేంద్రమంత్రి మ్యారేజ్ !

Union Minister Babul Supriyo got engaged with air hostess

12:06 PM ON 17th June, 2016 By Mirchi Vilas

Union Minister Babul Supriyo got engaged with air hostess

ప్రేమ ఎప్పుడు ఎలా పుడుతుందో అంటారు. కానీ వివిధ కారణాల చేత కొన్ని పెళ్లి పీటలదాకా వెళ్లవు. కొన్ని సక్సెస్ అవుతాయి. అదే సక్సెస్ ఇక్కడ కనిపిస్తోంది. విమానంలో వాళ్లద్దరి మధ్య ఏర్పడిన పరిచయం మెల్లగా ప్రేమకు దారితీసి, చివరకు పెళ్లివరకు వచ్చింది. ఇంతకీ వాళ్లెవరంటే, ఒకరు కేంద్రమంత్రి.. మరొకరు జెట్ ఎయిర్ వేస్ ఎయిర్ హోస్టెస్. వీరిద్దరూ పెద్దలను దాదాపుగా ఒప్పించడంతో కేంద్రమంత్రి బాబుల్ సుప్రీయో - ఎయిర్ హోస్టెస్ రచన శర్మ ఆగస్టులో వివాహ బంధంతో ఒకటవ్వబోతున్నారు.

రెండేళ్ల కిందట కోల్కతా- ముంబై ఫ్లయిట్ లో వీళ్లిద్దరి మధ్య రిలేషన్ కుదిరింది. రచనతో తన తొలి ప్రేమ గురించి కేంద్రమంత్రి ఇలా చెప్పుకొచ్చారు. '2014లో తాను యోగాగురువు రాందేవ్ బాబాతో కలిసి ప్రయాణిస్తున్నప్పుడు ఎంపీ సీటు విషయంపై చర్చిస్తున్నా. అదే టైమ్ లో ఎయిర్ హౌస్టెస్ రచన అదే విమానంలో ఉన్నారు. నా మాటలు విన్న బాబా.. సీటు వస్తే తప్పకుండా గెలుస్తారని భుజం తట్టారు.

మా మాటలు విన్న ఎయిర్ హోస్టెస్ రచన, తన ఆశలు నెరవేరుతాయని భరోసా ఇచ్చింది. అలా ఏర్పడ్డ రిలేషన్ కాస్త లవ్ గా మారి ఇప్పుడు మ్యారేజ్ కు దారితీసింది' అని వివరిస్తున్నారు. కొసమెరుపు ఏమంటే, ఈ మంత్రికి ఇదివరకే మ్యారేజ్ అయిందట.

ఇది కూడా చూడండి: హనుమంతుడి గురించి తెలీని నిజాలు

ఇది కూడా చూడండి: శరీరం నీరు పడితే ఎలా తొలగించుకోవాలంటే ...

ఇది కూడా చూడండి: ఫేస్ బుక్ సాక్షిగా...ఆత్మహత్య యత్నం...

English summary

Union Minister Babul Supriyo got engaged with air hostess Rachna Sharma.