ఓవర్ స్పీడ్ తో బుక్కైన మంత్రి సుజనా తనయుడు

Union minister Sujana Chowdary son Sai Karthik booked in rash driving case

05:07 PM ON 16th April, 2016 By Mirchi Vilas

Union minister Sujana Chowdary son Sai Karthik booked in rash driving case

అసలే భగభగ లాడే సూర్యుని ఎండకు జనం వడ దెబ్బ(సన్ స్ట్రోక్ ) తింటుంటే, కొంతమంది మాత్రం తమ పుత్ర రత్నాల పనులకు ఖంగు తింటున్నారు. అసలైన సన్ స్ట్రోక్ రుచి చూస్తున్నారు. ఇందులో రాజకీయ నేతలు, సెలబ్రిటీలు, కేంద్రమంత్రులు, సినీ స్టార్స్ ఎక్కువగా ఉంటున్నారు. తాజాగా కేంద్రమంత్రి సుజనా చౌదరి బ్యాంకుల నుంచి తీసుకున్న అప్పులు చెల్లించలేదని ఒక వైపు కోర్టు నోటీసులు ఎదుర్కొంటుంటే.. మరోవైపు ఇవన్నీ చాలక మంత్రి గారి సుపుత్రుడు సాయి కార్తీక్ చేసిన నిర్వాకం మరొకటి. హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ పోలీసుల చెకింగ్‌లో స్పీడ్‌గా కారు నడుపుతూ సుజనా చౌదరి కొడుకు అడ్డంగా దొరికిపోయాడు. ఇంకేముంది కేసు నమోదు కావడం, వెహికల్‌ను సీజ్ చేయడం పోలీసుల వంతైంది.

అన్నట్లు సాయి కార్తీక్.. అమెరికాలో బిజినెస్ మేనేజ్‌మెంట్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు... ఏవో బిజినెస్‌‌లు కూడా చేస్తున్నట్లు తెలుస్తోంది. సాయికి ఈ నెలలో మ్యారేజ్ చేయాలని పేరెంట్స్ అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు ఈలోగా ర్యాష్ డ్రైవింగ్ పేరుతో కొత్త లొల్లి లాంటివి కొంప ముంచుతుందేమోనని సుజనా బెంబేలెత్తుతున్నారట. నాలుగు అక్షింతలు పడేవరకు మీడియా కంట పడకుండా జాగ్రత్తగా వుండాలని పుత్రుడికి సుజనా హితబోధ చేసినట్టు ఇన్‌సైడ్ కధనం. ఆ మధ్య ఏపి మంత్రి రావెల కిషోర్ బాబు ఓ అమ్మాయిని ఏడిపిస్తూ, అడ్డంగా బుక్కయిన సంగతి తెల్సిందే. తాజా ఘటనతో సుజనా కొడుకు ట్రాఫిక్ పోలీసులకు బుక్కయ్యాడు.

English summary

Union minister Sujana Chowdary son Sai Karthik booked in rash driving case. His car was seized on the spot.