ఇంతకీ కాపురం భార్యతోనా? మోటార్ తోనా?(వీడియో)

Union minister Venkaiah Naidu makes fun on power cutting in AP

11:32 AM ON 21st October, 2016 By Mirchi Vilas

Union minister Venkaiah Naidu makes fun on power cutting in AP

ఇదేమిటి అని అనుకుంటున్నారా? ఇలా అడిగింది ఎవరో తెలుసా? సాక్షాత్తూ కేంద్రమంత్రి. వివరాల్లోకి వెళ్తే.. ఆంధ్రప్రదేశ్ ను మొన్నటివరకు అంథేరాప్రదేశ్ అని పిలిచేవారని.. అంటే చీకటి ప్రదేశమని... కరెంట్ ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి అని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. ఒకసారి రాయలసీమ ప్రాంతానికి వెళితే ఒక రైతు తనని ఒక మాట అడిగారని.. కరెంట్ లేక చాలా కష్టంగా ఉందని చెప్పాడని ఆయన అన్నారు. దానికి తోడు తనకి ఈ మధ్యే వివాహం అయిందని చెప్పాడు. అయితే సంతోషంగా ఉండాలని చెప్పానని వెంకయ్య అన్నారు.

పగలు కరెంట్ రావడంలేదని, రాత్రి తలుపేసుకుని లోపల పడుకుంటే.. పెద్దవాళ్లు వచ్చి తలుపు కొడుతున్నారని, ఏమంటే కరెంట్ వచ్చింది.. పోయి మోటార్ వేసిరావాలని చెబుతున్నారని, మోటారు వేసిన అరగంటకే కరెంట్ పోవడం, మళ్లీ ఇంటికి రావడం, కరెంట్ వస్తే మళ్ళీ వెళ్లి మోటార్ వేయడం.. తన పరిస్థితి ఇలా ఉందని ఆ రైతు వాపోయాడని వెంకయ్య అన్నారు. దీంతో తన భార్యకు అనుమానం వచ్చిందని, భార్యతో కాపురం చేయాలా? లేక మోటార్ తో కాపురం చేయాలా? అర్థం కావడంలేదని రైతు అన్నాడని మంత్రి పేర్కొన్నారు. అదండీ సంగతి.

English summary

Union minister Venkaiah Naidu makes fun on power cutting in AP