ఈ దున్న వీర్యం ఖరీదెంతో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

Unique Haryana Bull Special Attraction In Sadar Festival

05:20 PM ON 31st October, 2016 By Mirchi Vilas

Unique Haryana Bull Special Attraction In Sadar Festival

మనం చూస్తున్న ఈ దున్న ఖరీదు అక్షరాలా తొమ్మిది కోట్ల రూపాయలు. ఈ విరాట్ దున్న మహానగరంలో జరుపుకొనే సదర్ సంబరంలో విరాట్ మెరుపులు మురిపించనున్నాయి. అచ్చమైన రాచఠీవీని ఒలకబోసే ఈ విరాట్ వారిని నగరానికి రప్పించడానికే లక్షల రూపాయలు ఖర్చయిందంటే ఇక ప్రత్యేకతలు ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు! ఆకలేస్తే బాదం పిస్తాలు... కాదంటే కాజూలు. దాహమేస్తే మినరల్ వాటర్. అలాగే నిద్రపోవాలంటే సమ్మర్ లో 2 కాటన్ ల బీర్లు.. వింటర్ లో రెండు బ్లాక్ డాగ్ లు కుమ్మేస్తుందట. మగమహారాజులా సకల సౌకర్యాలనూ అనుభవిస్తున్న ముర్రా జాతికి చెందిన ఈ దున్నపోతు దేశవిదేశాల్లో ఎన్నో ప్రదర్శనలు ఇచ్చింది.

1/4 Pages

యాదవులందరూ కలసి చేసుకొనే ఈ పండుగలో దున్నపోతుల ప్రదర్శన దేశంలోనే ప్రత్యేకత సంతరించుకుంది. ఈసారి సంబరాలకు ప్రత్యేక ఆకర్షణ కానుంది హర్యానా విరాట్ దున్న. ఈ దున్నపోతు విలువ రూ.9 కోట్లు. గతేడాది యువరాజుకు 7కోట్లు పలికితే.. ఈ ఏడాది దున్నపోతు విలువ 9కోట్లు. పదిమంది పనివారు దీన్ని కంటికి రెప్పలా చూసుకుంటున్నారు. సదర్ ఉత్సవాల్లో విరాట్ ను ప్రదర్శిస్తారు.

English summary

Unique Haryana Bull Special Attraction In Sadar Festival