గురు పూర్ణిమ గురించి మనకు తెలియని నిజాలు

Unknown Facts About Guru Purnima

12:25 PM ON 19th July, 2016 By Mirchi Vilas

Unknown Facts About Guru Purnima

తెలుగు మాసాలలో ఆషాఢ మాసానికి కూడా ఓ ప్రత్యేకత ఉంది. గురువుని ఆరాధించే సమయం ఈమాసంలోనే వస్తుంది. అదే గురుపూర్ణిమ. ఆషాడ పూర్ణిమనుండి నాలుగు మాసాలు చాతుర్మాసం పాటిస్తారు. మనవాళ్ళు ఏమి చేసినా అందులో శాస్త్రీయత, ఆరోగ్య రహస్యం కూడా ఉంటాయి. ఈ నాలుగుమాసములు వర్షాకాలము అయినందున , వ్యాధులు ప్రబలే కాలం కనుక, ఎలాంటి పర్యటనలు , దేశ సంచారము చేయకుండా పూర్వకాలములో శిష్యులు , గురువులు కూడా ఒకేచోటే తాత్కాలికంగా నివాసము ఏర్పరచుకునేవారట. అలా చాతుర్మాస్య దీక్ష సమయంలో శి్ష్యులు గురుగు దగ్గర వి్జ్ఞాన సముపార్జన చేసేవారు. ఈ జ్ఞానసముపార్జన లో మొదటిరోజు ని గురువుని ఆరాధించడానికి ప్రత్యేకించేవారు. ఈ సంప్రదాయమే కాలక్రమేణా "గురుపూర్ణిమ" గా మారిందని అంటారు.

1/7 Pages

మనకు ఆదిగురువు వేదవ్యాసులవారు. అందుకే వ్యాసులవారు పుట్టినరోజునే గురుపూర్ణిమ, వ్యాసపూర్ణిమ అంటారు. గురువులను, ఉపాధ్యాయులను, పెద్దలను పూజంచే రోజు ఇది. హిందువులు ప్రతి సంవత్సరం ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజున గురుపూర్ణిమ జరుపుకుంటారు. ఈ రోజున గురుపూజోత్సవం జరిపి గురువులకు కానుకలు, బహుమతులు సమర్పించి వారిని సత్కరించి వారి ఆశీర్వాదములు తీసుకొంటారు.

English summary

Unknown Facts About Guru Purnima.