మహా భారతంలో పిట్ట కథలు

Unknown facts about Mahabharata

12:21 PM ON 12th February, 2016 By Mirchi Vilas

Unknown facts about Mahabharata

భారతీయ ఇతిహాస  పురాణాల్లో కథలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. అంతేకాదు సందేశాన్ని, ఆసక్తిని,  ,ప్రయోజనాన్ని మిళితం చేసి ఉంటాయి. ఇక రామాయణ , మహాభారతం లలో అయితే లెక్కకు మించిన కధలు వుంటాయి. అందులో మహాభారతం నుండి ఎంచిన పిట్ట కధలు ఆస్వాదించండి. 

1/8 Pages

1. నపుంసకుడి రూపంలోకి అర్జునుడు

ఇంద్రలోకంలో అప్సరస అయిన ఊర్వశి  అర్జునుని పై వ్యామోహ పడుతుంది. కానీ అర్జునుడు ఊర్వశిని తల్లిగా భావించి తిరస్కరిస్తాడు.దాంతో ఊర్వశికి కోపం తట్టుకోలేక అర్జునున్ని నపుంసకుడవు అవుతావని శపిస్తుంది. ఈ శాపం గురించి తెలుసుకున్న అర్జునుడి  శాపానికి విమోచనం కల్పిచేందుకు ఇంద్రుడు యోచన చేస్తాడు.  పాండవులు అజ్ఞాత వాసంలో గడిపే సంవత్సర కాలంలో మాత్రమే ఈ శాపం అనుభవించేలా  ఉపశమనం కల్పిస్తాడు. ఆవిధంగా  అర్జునికి తన జీవిత కాలం నంపుంసకునిగా ఉండాల్సిన దుస్థితిని  ఇంద్రుడు తప్పించాడు.  అందుకే అర్జునుడు తన అజ్ఞాతంలో విరాట రాజు కొలువులో బృహన్నల(నంపుంసకుడి) వేషంలో గడపాల్సి వచ్చిందన్న మాట. పాండవులు  12 సంవత్సరాలు అరణ్య  వాసం పూర్తిచేసి,   13 వ సంవత్సరం అజ్ఞాత వాసాన్ని  విరాట రాజు కొలువులో   ఊర్వశి శాపం పలితంగా  బృహన్నల అనే నపుంసకుడిగా అర్జునుడు గడిపాడు. అదండీ,  ఆ విధంగా ఊర్వశి శాపాన్ని  అర్జునుడు అనుభవించక తప్పింది కాదు. 

 

English summary

In this article, we have listed Unknown facts about Mahabharata. Mahabharata is one such epic, where we find these types of topics in abundance.