మహానంది గురించి మనకు తెలీని నిజాలు

Unknown Facts About Mahanandi

11:58 AM ON 31st December, 2016 By Mirchi Vilas

Unknown Facts About Mahanandi

శివునికి ఎన్నో క్షేత్రాలున్నా ఒక్కో క్షేత్రానికి ఒక్కో ప్రాధాన్యత ఉంది. ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాలంటే సాక్షాత్తు పరమేశ్వరుడే ఆవు రూపంలో వెలిసిన మహానంది క్షేత్రం ఒకటి. నల్లమల పర్వతాల అడవుల్లో వెలసిన ఈ పుణ్యక్షేత్రంలో... పరమశివుడు స్వయంభువుగా గోవు(ఆవు) ఆపద ముద్రరూపంలో వెలిశాడు! ఇక్కడి శివలింగం కింది నుంచి ఏడాది పొడవునా ఒకేస్థాయిలో స్వచ్ఛమైన ఔషధ గుణాలున్న నీటి ప్రవాహం కొనసాగుతుంటుంది. వేసవిలో చల్లగా.. శీతాకాలంలో వెచ్చగా, వానాకాలంలోనూ మలినాల్లేకుండా, సూది సైతం స్పష్టంగా కనబడేస్థాయి స్వచ్ఛతతో ఉండటం ఈ నీటి ప్రత్యేక లక్షణం అని చెబుతారు. ఈ క్షేత్రం గురించి పూర్తి వివరాల్లోకి వెళ్తే,

1/15 Pages

పూర్వీకులు చెప్పేదాని ప్రకారం, ఒక రుషి నల్లమల కొండల్లో చిన్న ఆశ్రమం ఏర్పాటు చేసుకొని కుటుంబంతో జీవించేవాడు. అతడు శిలాభక్షకుడై ఎల్లప్పుడు తపోధ్యానంలో నిమగ్నమై ఉండేవాడు. దాంతో ఆయన్ను అంతా శిలాదుడని(శిలాద మహర్షి) పిలిచేవారు.

English summary

Here are some Unknown Facts About Mahanandi.