పంచముఖి ఆంజనేయుని గురించి ఆసక్తికర అంశాలు

Unknown facts about Panchamukhi Anjaneya Swamy

11:51 AM ON 14th July, 2016 By Mirchi Vilas

Unknown facts about Panchamukhi Anjaneya Swamy

మనం ఇంట్లో రకరాల దేవుళ్ళ ఫోటోలు పెట్టుకుంటాం కదా. అయితే పంచముఖ ఆంజనేయ స్వామి ఫోటోలు కూడా చాలామంది పెట్టుకోవడం కూడా చూస్తుంటాం. ఈ పంచముఖ ఆంజనేయ స్వామి గురించి తెలుసుకోవాలంటే, రామాయణమే మార్గం. రామ రావణ యుద్ద సమయంలో రావణుడు మహీరావణుడి సాయం కోరుతాడు, పాతాళానికి అధిపతి మహీరావణుడు. ఆంజనేయుడు ఏర్పాటు చేసిన వాల సయనమందిరం ( తోకతో ఏర్పాటు చేసిన) నుండి రామ లక్ష్మణులను మహీరావణుడు విభీషణుడి రూపంలో వచ్చి అపహరిస్తాడు. అది తెలుసుకొన్న ఆంజనేయుడు శ్రీ రామ లక్ష్మణులను వెతకడానికి పాతాళానికి వెళ్తాడు.

పాతాళంలో వివిధ దిక్కులలో ఉన్న ఐదు దీపలను ఒకేసారి విచ్చిన్నం చేస్తే మహీరావణుడు ప్రాణాలు వీడుతాడని తెలుసుకొన్న పవన సుత హనుమాన్ వెంటనే పంచముఖ ఆంజనేయ స్వామి రూపం దాలుస్తాడు. అందులో ఒక ముఖం ఆంజనేయుడిది కాగా, గరుడ, వరాహ, హయగ్రీవ, నరసింహాదులు కలసి పంచముఖ అవతారంగా ఏర్పడి ఆ దీపాలను ఒకేసారి విచ్చినం చేసి (ఆర్పి) శ్రీరామ లక్ష్మణులను కాపాడుకొంటాడు.

1/11 Pages

పంచముఖాలు - ఐదు దిక్కులు

శ్రీరాముడికి హనుమంతుడు పరమభక్తుడే కాదు, హనుమంతుడు భక్తసులభుడు కూడా. హనుమంతుడి కరుణాకటాక్షాలు కలగాలంటే శ్రీరాముడిని పూజించి భజన చేస్తే చాలు భజన చేస్తున్న ప్రదేశంలో హనుమంతుడు ఏదో ఒక అవతారంలో అక్కడ సాక్షాత్కరిస్తాడని పండితుల మాట. అలాగే ఆంజనేయస్వామి నవ అవతారాలలో దర్శనం ఇస్తాడు.

English summary

Unknown facts about Panchamukhi Anjaneya Swamy.