శబరిమలలో ఉన్న స్వర్ణదేవాలయం గురించి ఎవరికీ తెలియని రహస్యాలు..

Unknown facts about Sabarimala

11:47 AM ON 25th November, 2016 By Mirchi Vilas

Unknown facts about Sabarimala

కార్తీక మాసం వస్తే, అయ్యప్ప స్వాముల సందడి కనిపిస్తుంది. మండల దీక్ష తీసుకుని అయ్యప్పను దర్శించుకోవడం పరిపాటి. ఇక సంక్రాంతికి జ్యోతి దర్శనం సరేసరి. అయితే అయ్యప్పలు ఇరుముడులు కట్టుకుని వెళ్ళేది సబరిమలకే. ఇంతకీ శబరిమల/శబరిమలై, కేరళ రాష్ట్రంలోగల ఒక ప్రసిద్ధి గాంచిన పుణ్యక్షేత్రం అని తెలుసు కదా. ఇక్కడ కొలువైన దేవుడు అయ్యప్ప, హిందువులు ఈయనను హరిహరసుతుడిగా భావించి పూజిస్తారు. ఈ ప్రదేశం పశ్చిమ కనుమల్లో నెలకొని ఉంది. కేరళలోని పత్తినంతిట్ట జిల్లాలో సహ్యాద్రి పర్వత శ్రేణుల ప్రాంతం క్రిందకు వస్తుంది. గుడి సముద్ర మట్టం నుంచి సుమారు 3వేల అడుగుల ఎత్తులో దట్టమైన అడవులు -18 కొండల మధ్య కేంద్రీకృతమై ఉంటుంది.

ఇక్కడికి యాత్రలు నవంబర్ నెలలో ప్రారంభమై జనవరి నెలలో ముగుస్తాయి. ఇక్కడికి దక్షిణాది రాష్ట్రాల భక్తులే కాక ఇతర రాష్ట్రాల నుంచీ, విదేశాల నుంచి కూడా అయ్యప్ప భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తారు. మండల పూజ(నవంబర్ 17), మకరవిళక్కు(జనవరి 14) ఈ యాత్రలో ప్రధాన ఘట్టాలు. జనవరి 14వ రోజును ఆలయంలో మకర జ్యోతి దర్శనమిస్తుంది. మిగతా అన్ని రోజుల్లోనూ గుడిని మూసే ఉంచుతారు. కానీ ప్రతీ మలయాళ నెలలో ఐదు రోజుల పాటు తెరచి ఉంచుతారు. ఒకప్పుడు శబరిమల యాత్ర అంటే భయం భయంగా వెళ్లేవారు. ఎప్పుడు ఏ చోట ఏ ప్రమాదం ముంచుకొస్తుందో ఎవరికీ తెలిసేది కాదు. కానీ ఇప్పుడు ఈజీగా వెళ్లి వస్తున్నారు.

అప్పట్లో శబరిమల వెళ్ళటానికి ఒకే ఒక్క దారి ఉండేది, దాని పేరు ఎరుమేలిమార్గం. ఈ దారిలోనే పూజారులు, సిబ్బంది ఆలయానికి గుంపులు.. గుంపులుగా, ఒక్కటిగా వెళ్లేవారట. శబరిమల అడవీ ప్రాంతం అవ్వటం వల్ల అప్పటి నుండి ఇప్పటి వరకూ గ్రూపులుగా వెళ్ళటం ఆనవాయితీగా వస్తుంది. మరి శబరిమల గురించి మరికొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం..

1/15 Pages

1. గర్భగుడిలో ఏకశిలా విగ్రహం...


1907లో శబరిమల గర్భగుడి పైకప్పు ఎండుగడ్డితో, ఆకులతో కప్పబడివుండేది. అప్పట్లో గర్భగుడిలో ఏకశిలా విగ్రహానికి పూజలు చేసేవారు.

English summary

Unknown facts about Sabarimala