రిలయన్స్ దెబ్బకు టెలికాం కంపెనీల అన్ లిమిటెడ్ బాట

Unlimited Plans were announced by the leading telecom companies

11:31 AM ON 9th January, 2017 By Mirchi Vilas

Unlimited Plans were announced by the leading telecom companies

జియో పేరిట రిలయన్స్ ఇచ్చిన ఆఫర్ బానే వర్కవుట్ అవుతోంది. కోట్లాదిమంది ఈ నెట్ వర్క్ కి అనుసంధానమై, ఉచిత నెట్,కాల్స్ ఎంజాయ్ చేస్తున్నారు. రిలయన్స్ ఇచ్చిన ఈ ఆఫర్ కారణంగా ఇతర కంపెనీలకు కోలుకోలేని దెబ్బ తగిలింది. దీంతో రిలయన్స్ దెబ్బకు ఇతర టెలికాం కంపెనీలన్నీ అన్ లిమిటెడ్ బాటలో పట్టాయి . జియో తర్వాత బీఎస్ఎన్ ఎల్ అన్ లిమిటెడ్ ప్లాన్స్ ప్రకటించింది. ఇక టెలికాం దిగ్గజం ఎయిర్ టెల్ కు కూడా అన్ లిమిటెడ్ తిప్పలు తప్పలేదు. మొత్తానికి అన్ని కంపెనీలు అన్ లిమిటెడ్ ప్లాన్స్ ప్రకటించడంతో వినియోగదారులు యమ జోష్ లో వున్నారు. అయితే ఈ ప్లాన్స్ అన్నీ జియోకు ప్రజలు ఆకర్షితులు కాకుండా చూడటం కోసమే అనేది బహిరంగ రహస్యం. ఈ అపరిమిత డేటా, వాయిస్ ప్లాన్స్ ఇలాగే కొనసాగుతాయో లేదో అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న.

అయితే ఒక్కటి మాత్రం నిజం, ప్రజలు మాత్రం ప్రస్తుతానికైనా టెలికాం కంపెనీల అడ్డగోలు ప్లాన్స్ నుంచి తమకు విముక్తి కలిగిందని భావిస్తున్నారు. నిమిషానికి అన్ని పైసలు, ఇన్ని పైసలు అని రకరకాల ప్లాన్స్ తో ప్రజలను అయోమయంలోకి నెట్టేసిన టెలికాం కంపెనీలు జియో దెబ్బకు ఏకధాటిపైకి వచ్చాయి. గతంలో కొన్ని టెలికాం కంపెనీలు ఫుల్ టాక్ టైం ఆఫర్లు ప్రకటించేవి. కానీ వ్యాలిడిటీ మూడు రోజులు, రెండు రోజులంటూ అడ్డగోలు షరతులు విధించేవి. ఏదేమైనా జియో రాకతో ఇతర టెలికాం నెట్ వర్క్ యూజర్లు కూడా కొంత లాభపడ్డారనే చెప్పాలి. ప్రముఖ టెలికాం కంపెనీలు ప్రకటించిన అన్ లిమిటెడ్ ప్రీపెయిడ్ ప్లాన్స్ ఎలా ఉన్నాయో ఓసారి చూద్దాం.

1/7 Pages

అన్ లిమిటెడ్ మంత్లీ ప్లాన్స్:

ఎయిర్ టెల్:

అన్ లిమిటెడ్ ఎయిర్ టెల్ టూ ఎయిర్ టెల్ లోకల్ అండ్ ఎస్టీడీ కాల్స్, 300 ఎంబీ ఉచిత డేటా: 148 రూపాయలు, 28 రోజుల వ్యాలిడిటీ. అలాగే అన్ లిమిటెడ్ ఆల్ లోకల్ అండ్ ఎస్టీడీ కాల్స్, 1జీబీ ఉచిత 4జీ డేటా : 349రూపాయలు, 28రోజుల వ్యాలిడిటీ.

English summary

Unlimited Plans announced by the leading telecom companies.