పెళ్లికాని ప్రసాద్ లు.. బి కేర్ ఫుల్!

Unmarried people be careful with marriage buros

01:43 PM ON 21st November, 2016 By Mirchi Vilas

Unmarried people be careful with marriage buros

ఆ వయస్సు దాటినా, పెళ్లికాని ప్రసాద్ లు ఎందరో వున్నారు. కెరీర్ కోసమంటూ వివాహాన్ని వాయిదా వేస్తూ వచ్చిన ముదురు బ్రహ్మచారుల లెక్క చెప్పలేం. మూడుపదులు దాటిన వయసులో వధువు కోసం వేట సాగించే వాళ్ళెందరో వున్నారు. అందుకే తమ స్థాయికి తగిన సంబంధం అని తెలియగానే, వెనకా ముందూ చూసుకోకుండా ఎగిరి గంతేస్తారు. లగ్గం పెట్టించి పెళ్లి పీటలెక్కేందుకు తహతహలాడుతుంటారు. సరిగ్గా అదే కొందరికి కాసుల వర్షం కురిపిస్తోంది. పెళ్లికోసం ఎదురుచూసే బ్రహ్మచారులు, రెండోపెళ్లికి సిద్ధమైన పురుషులను లక్ష్యంగా చేసుకుని బురిడీ కొట్టించేందుకు కొన్ని వివాహ పరిచయ వేదికలు సిద్ధంగా ఉన్నాయి.

మోసపోయేవాళ్లున్నంత కాలం మోసగించేవాళ్లు ఉంటూనే ఉంటారని అంటారు కదా. సవాలక్ష మాయలకు శతకోటి మార్గాలు అన్నట్టుగా ఈ కంత్రీలు.. మ్యారేజ్ బ్యూరోల ముసుగులో పెద్దఎత్తున మోసాలకు తెగబడుతున్నారు. ఇందుకోసం కేవలం ఐదొందల రూపాయలు మాత్రమే ఈ ఖతర్నాక్ లు వెచ్చించే ఖర్చట. అసలు విషయాల్లోకి వెళ్తే...

1/9 Pages

దేశంలో ఇప్పుడు ఎన్నో మ్యారేజ్ బ్యురోలున్నాయి. ఇందులో కొన్ని కరెక్ట్ గా పనిచేసినా చాలావరకూ బురిడీ కొట్టించేస్తున్నాయని అంటున్నారు. అందుకే జాగ్రత్త అవసరం.
పెళ్లిళ్ల పేరయ్యలు కనుమరుగయ్యాక ఈ వేదికలే జంటలను ఏకం చేయటంలో కీలకంగా మారాయి. ఆయా సామాజిక వర్గాలకు అనువైన సంబంధాలు కుదుర్చుతూ.. ఇరు కుటుంబాల నుంచి కమీషన్ తీసుకునేవారు. లాభసాటిగా ఉండటంతో.. కొద్దోగొప్పో పరిచయాలున్న వారంతా పార్ట్ టైమ్ పేరయ్యలుగా మారిపోయారు.

English summary

Unmarried people be careful with marriage buros