అనుష్క 'భాగమతి'లో ఎన్టీఆర్ విలన్

Unni Mukundan is acting in a Bhagmati movie male lead role

03:07 PM ON 21st July, 2016 By Mirchi Vilas

Unni Mukundan is acting in a Bhagmati movie male lead role

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'జనతా గ్యారేజ్'. కొరటాల శివ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో మోహన్ లాల్, నిత్యా మీనన్ లతో పాటు మరో మలయాళీ నటుడు కూడా ఉన్న సంగతి చాలా మందికి తెలియదు. ఉన్ని ముకుందన్ అనే యంగ్ మలయాళీ యాక్టర్ ఇందులో విలన్ పాత్ర పోషిస్తున్నాడు. ఈ సినిమా ఇంకా విడుదల కాకముందే మళ్ళీ తెలుగులో ఇంకో అవకాశం ఉన్ని ముకుందన్ ను వెతుక్కుంటూ వచ్చింది. 'పిల్ల జమీందార్' ఫేం అశోక్ దర్శకత్వంలో అనుష్క ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న థ్రిల్లర్ మూవీ 'భాగమతి'లో అతనే కథానాయకుడిగా నటించబోతుండటం విశేషం.

ఈ చిత్రంలో ఆది పినిశెట్టి లీడ్ రోల్ నటిస్తాడని వార్తలొచ్చాయి. అయితే అతడికీ ఇందులో ఒక పాత్ర ఉంది. ఉన్ని ముకుందన్ మాత్రం అనుష్కకు జోడీగా నటించడం చాలా ఆనందంగా ఉందని చెపుతున్నారట. గత మూడేళ్ళుగా చర్చల్లో ఉన్న భాగమతి షూటింగ్ కొద్ది రోజుల క్రితమే మొదలైంది. యూవీ క్రియేషన్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ఈ చిత్రంలో గెస్ట్ రోల్ చేసే అవకాశాలున్నట్లు రూమర్లు వినిపిస్తున్నాయి.

English summary

Unni Mukundan is acting in a Bhagmati movie male lead role