సిరియాపై త్వరలో శాంతి చర్చలు ప్రారంభం

UNO to discuss With Syria on Peace

03:42 PM ON 19th December, 2015 By Mirchi Vilas

UNO to discuss With Syria on Peace

గత కొన్ని సంవత్సరాలుగా సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న సిరియాలో శాంతిని పునరుద్ధరించేందుకు ఐకర్యాజ్యసమితి చర్యలు ముమ్మరం చేసింది. అంతర్యుద్ధంతో రగులుతోన్న సిరియా సమస్యను శాంతియుతంగా పరిష్కరించాలని భద్రతా మండలి ఒక నిర్ణయానికి వచ్చింది. సిరియా వేర్పాటువాదులతో కాల్పుల విరమణ ప్రకటించి, ఆ దేశాధ్యక్షుడు అసద్ బాషర్‌తో చర్చలు చేపట్టాలని యూఎన్ తీర్మానించింది. సిరియాలో శాంతి చర్చలపై అమెరికా, రష్యాతో పాటు మరో 17 సభ్య దేశాలు స్వాగతించాయి. ఒకవేళ భద్రతా మండలి ప్రణాళిక ఫలిస్తే రెబెల్స్‌తో పాటు అసద్ ప్రభుత్వం ఒకే వేదికపై చర్చల్లో పాల్గొనే అవకాశం ఉంది. ఈ ప్రయత్నం వల్ల అమెరికా, రష్యా దళాలు ఇక నుంచి ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులపై తమ దృష్టిని కేంద్రీకరించేందుకు మార్గం సులువవుతుంది.

English summary

For the first time since five year old Syrian civil war began, world powers agreed on Friday at the United Nations Security Council to embrace a plan for a cease-fire and a peace process that holds the distant prospect of ending the conflict.