నార్త్ కొరియాకు యూఎన్ వార్నింగ్

UNO Warned North Korea

04:44 PM ON 7th January, 2016 By Mirchi Vilas

UNO Warned North Korea

హైడ్రోజన్ బాంబును పరీక్షించిన నార్త్ కొరియాను ఐక్యరాజ్యసమితి(యూఎన్) తీవ్రంగా హెచ్చరించింది. ఆ దేశంపై కఠిన ఆంక్షలను అమలులోకి తీసుకురానున్నట్లు భద్రతా మండలి పేర్కొంది. హైడ్రోజన్ బాంబు పరీక్షను ఖండించిన యూఎన్ ఆ ప్రయోగం వల్ల అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు కలిగిందని అభిప్రాయపడింది. నాలుగుసార్లు అణు పరీక్షలు నిర్వహించిన ఉత్తర కొరియా బుధవారం మొదటిసారి హైడ్రోజన్ బాంబును పరీక్షించింది. హైడ్రోజన్ బాంబును పరీక్షించినట్లు ఉత్తర కొరియా ప్రకటన చేయగానే భద్రతా మండలి అత్యవసర సమావేశమైంది. అమెరికా, జపాన్, దక్షిణ కొరియా దేశాలు ఆ సమావేశానికి హాజరయ్యాయి. ఉత్తర కొరియాపై తాజా ఆంక్షలను అమలు చేయనున్నట్లు భద్రతా మండలి అధ్యక్షుడు ఎల్బీ రోసెల్లి తెలిపారు. ఐక్యరాజ్యసమితి నియమావళిని ఉల్లంఘించిన కారణంగా ఉత్తర కొరియాపై సరికొత్త ఆంక్షలను తీసుకొచ్చేందుకు భద్రతా మండలి త్వరలో తీర్మానం చేయనున్నట్లు చెప్పారు. ఇప్పటికే ఉత్తర కొరియాపై అనేక ఆంక్షలు ఉన్నాయి. ఆ దేశానికి ఆయుధాలు, లగ్జరీ వస్తుల సరఫరాను నిలిపేశారు. విదేశీ అకౌంట్లు ఇవ్వడం, ప్రయాణాలను నిషేధించారు.

English summary

UNO warns North korea for experimenting hydrogen bomb recently.UN security committe was ready to take action on North Korea.Many of the countries opposed North Koreas Hydrogen Bomb Experiment