ప్రపంచంలో వింత మత ఆచారాలు

Unusual religious rituals and beliefs

07:05 PM ON 16th February, 2016 By Mirchi Vilas

Unusual religious rituals and beliefs

ప్రతి మతం మరియు సంస్కృతిలో అనేక సంప్రదాయాలు మరియు ఆచారాలు ఉన్నాయి. క్రైస్తవ మతం, జుడాయిజం మరియు ఇస్లాం మతం మొదలైన వాటిల్లో జననం, వివాహం, యుక్తవయస్సు మరియు మరణం వంటి వాటికి గుర్తుగా అనేక వేడుకలు మరియు పద్ధతులు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా, భక్తులు అసాధారణమైన సంప్రదాయాలకు కట్టుబడి ఉన్నారు. అయితే ఇది  విశ్వాసకులకు పూర్తిగా సహేతుకముగా కనిపిస్తుంది. ఇప్పుడు ఆ వింత ఆచారాల గురించి తెలుసుకుందాం.

1/9 Pages

1. శరీర బాగాల మీద కుట్టించుకొవటం

తైపూసం వేడుకల సమయంలో, ప్రపంచ వ్యాప్తంగా హిందువులు వారి శరీరం యొక్క వివిధ బాగాలలోకుట్టించుకోని మురుగన్ మీద భక్తిని ప్రకటిస్తారు. సాదారణంగా బరిసెలు, పెద్ద హుక్స్, చిన్న కత్తి వంటి వాటితో కుట్టించుకుంటారు. ధ్యానం సమయంలో మౌనంగా ఉండి  నాలుక, వీపు, ఛాతీ మరియు ముఖం మీద కుట్టించుకుంటారు. కొంత మంది భక్తులు వారి వెనుకభాగంలో అనేక పెద్ద హుక్స్ అటాచ్ చేసుకొని రథాలను లాగుతూ ఉంటారు.

ప్రతి సంవత్సరం ఫిబ్రవరి నెలలో వచ్చే మూడు రోజుల తైపూసం పండుగ మిలియన్ కంటే ఎక్కువ మంది ప్రజలను ఆకర్షిస్తుంది. తమిళ హిందువులు మురుగన్ పుట్టినరోజు మరియు  కత్తితో దుష్ట ఆత్మను పోగొట్టటానికి ఈ వేడుకను చేసుకుంటారు. కుట్టించుకున్న భక్తులు వారి భక్తిని  ప్రదర్శించేందుకు మరియు వారి కోరికలు తీరటానికి పండుగ కవాతులు చేస్తారు.

English summary

Here are some unusual religious rituals and beliefs around the world. Every religion and culture has what outsiders consider odd traditions or rites of passage, but which seem perfectly acceptable to true believers.