అఖిలేష్ హెలిప్యాడ్ కోసం నీటి వృధా ....

UP CM Akhilesh Yadav Wastes Water For His Helipad

12:30 PM ON 21st April, 2016 By Mirchi Vilas

UP CM Akhilesh Yadav Wastes Water For His Helipad

నిన్న మహారాష్ట్రలో నేడు యూపిలో ... హెలిప్యాడ్ కోసం భారీగా నీటిని వృధా చేసేసారు. ఓ వైపు చుక్క నీటి కోసం కటకట లాడుతుంటే, మరో వైపు నేతల హెలీప్యాడ్‌ల కోసం భారీగా నీటి దుర్వినియోగం చేయడం, ఈ వేసవిలో వరసగా వెలుగు చూస్తున్నాయి. మొన్నటికి మొన్న మహారాష్ట్రలో కరవు ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించేందుకు వెళ్లిన ఆ రాష్ట్ర రెవెన్యూ మంత్రి ఏకనాథ్‌ ఖడ్సే కోసం భారీగా నీటిని వృథా చేసి హెలీ ప్యాడ్‌ ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి అఖిలేశ్‌ యాదవ్‌ కోసం హెలీప్యాడ్‌ ఏర్పాటుకు బోలెడన్ని నీరు వృథా చేశారు. అఖిలేశ్‌ ఉత్తరప్రదేశ్‌లోని కరవు ప్రభావిత ప్రాంతమైన లలిత్‌పూర్‌లో మంగళవారం పర్యటించారు. ఆయన చాపర్‌ని కిందికి దించేటప్పుడు హెలిపాడ్‌ వద్ద దుమ్ము లేవకుండా ఉండడానికి బోలెడు నీటిని వాడేసారు. కాగా ఆ పర్యటనలో భాగంగా కేంద్రం పై అఖిలేశ్‌ విమర్శలు గుప్పించారు. యూపీలోని కరవు పీడిత ప్రాంతాలపై కేంద్రం స్పందించకుండా గుడ్డిగా వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. అయితే నీటి వృధా సందర్భంగా తీసిన వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. దీనిపై నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తూ , కామెంట్లతో కుమ్మేస్తున్నారు.

ఇవి కూడా చదవండి : వచ్చే రెండు నెలల్లో భూమికి పెను ముప్పు పొంచి ఉందనడానికి కారణాలు

ఇవి కూడా చదవండి :

చిరుకు షాకిచ్చిన ఉపాసన

కూతుర్ని రేప్ చేసాడని ఆ కామాంధుడు చేతులు నరికేసిన తండ్రి

'సర్దార్' చిత్రం పై దాసరి షాకింగ్ కామెంట్స్

English summary

Uttar Pradesh Chief Minister Akhilesh Yadav visited drought hit Lalitpur in UP and for that tour soo many liters of water was wasted by the officials. Some of the opposition party leaders opposed this thing.