యు.పిలో ఓటేస్తే, స్మార్ట్ ఫోన్ ఇచ్చేస్తారట ...

UP Government Launches Smart Phone Yojana Scheme

11:26 AM ON 6th September, 2016 By Mirchi Vilas

UP Government Launches Smart Phone Yojana Scheme

దేశంలో ఎక్కడ ఎన్నికలు వస్తున్నా, రకరకాల హామీలు, తాయిలాలతో కూడిన పధకాలు ప్రకటిస్తారు. ఇక అధికారంలో వున్నవాళ్లయితే ఇక చెప్పక్కర్లేదు. అధికారం నిలబెట్టుకోడానికి పాలకులు ప్రజల మీద కురిపించే వరాల జల్లు ఒక రాష్ట్రాన్ని మించి మరో రాష్ట్రంలో కనిపిస్తున్నాయి. ఇటీవల తమిళనాడులో ఎన్నికల సందర్బంగా జయలలిత ప్రకటించిన వరాలు ఓటర్లను బానే ఆకర్షించాయి. అందుకే మళ్ళీ అధికారం వచ్చేసింది. ఓటర్లను ఆకట్టుకునేందుకు రకరకాల పథకాలను ప్రవేశ పెట్టడం బానే కల్సి వస్తున్నందున ఇప్పుడు ఉత్తరప్రదేశ్ లో అఖిలేశ్ యాదవ్ ప్రభుత్వం అదే పంథాలో నడుస్తోంది.

వచ్చే ఏడాది యూపీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రత్యేక పథకాన్ని ప్రవేశపెట్టింది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ సోమవారం సమాజ్ వాది స్మార్ట్ ఫోన్ యోజన పథకాన్ని ప్రవేశపెట్టారు. ఈ పథకం కింద ప్రజలకు ఎదో మామూలు స్మార్ట్ ఫోన్లు కాదు, అధునాతన ఫీచర్లు ఉన్న స్మార్ట్ ఫోన్లను అందించనున్నారు. ప్రభుత్వ పథకాలు తెలుసుకునేందుకు, పేద ప్రజలను విద్యావంతులు చేసి సమాచారాన్ని ఒకరికొకరు తెలియజెప్పుకునేందుకు సులువుగా ఉంటుందని ఈ పథకాన్ని ప్రవేశపెట్టినట్లు ప్రభుత్వం ప్రకటించింది.

అన్ని రకాల యాప్స్ తో పాటు, ఫేస్ బుక్ ఉపయోగించి ప్రభుత్వ పథకాలు ప్రజలు నేరుగా తెలుసుకోవచ్చని అధికారులు వెల్లడించారు.

ఉత్తరప్రదేశ్ లో నివసిస్తూ 18 సంవత్సరాలు నిండిన ఎవరైన ఈ పథకం కింద దరఖాస్తు చేసుకోవచ్చు. కుటుంబం ఆదాయం సంవత్సరానికి రెండు లక్షల రూపాయల లోపు ఉన్నవారికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. వచ్చే వారం నుంచి దీనికి సంబంధించి రిజిస్ట్రేషన్లను ఆన్ లైన్ లో చేసుకునే సదుపాయాన్ని కల్పించనున్నారు. లబ్ధిదారులకు ఈ స్మార్ట్ ఫోన్లను హోం డెలివరీ చేయనున్నట్లు తెలిపారు. యువతను ఆకట్టుకునేందుకు ప్రభుత్వం దీనిపై దృష్టి సారించింది.

ఇప్పుడే ఇవ్వరు...

అయితే స్మార్ట్ ఫోన్లను 2017 రెండో భాగంలో పంపిణీ చేస్తామని అంటున్నారు. 2017 ప్రధమార్థంలోనే యూపీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అప్పుడు ఎవరు అధికారంలోకి వస్తారో తెలియదు. అయితే ముందుగానే ఓటర్లను తమవైపుకు ఆకట్టుకునేందుకు వీలుగా సమాజ్ వాదీపార్టీ ఈ హామీని ఇచ్చిందని రాజకీయపరిశీలకులు భావిస్తున్నారు. అంటే ఆ పార్టీకి ఓటేస్తే, ఆ పార్టీ అధికారంలోకి వస్తే అప్పుడు స్మార్ట్ ఫోన్ వస్తుంది. భలే ఐడియా కదా. ఒకవేళ బెడిసి కొడితే, ఇక అంతే సంగతులు.

కాగా ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో రానున్న తరాలకు ఉపయోగపడే పలు పథకాలను తమ ప్రభుత్వం ప్రవేశపెట్టనున్నట్లు అఖిలేశ్ యాదవ్ ప్రకటించారు. ఈనెల 7వ తేదీ నుంచి సమాజ్ వాది పార్టీ నిర్వహించనున్న ఎన్నికల ప్రచారంలో ఆ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ పాల్గొననున్నారు.

ఇవి కూడా చదవండి: వెనిజులా ప్రెసిడెంట్ ని తరిమి కొట్టేసారు ..

ఇవి కూడా చదవండి:బిజినెస్ స్టార్ట్ చేసిన బన్నీ వైఫ్!

English summary

In India So many political parties will announce so many offers and schemes to attract the people and now Uttar Pradesh announced a new scheme named "Smart Phone Yojana" and with this scheme everyone can know latest updates and schemes of U.P Government.