అక్కడికి వెళ్లాకే పిల్లల్ని కంటానన్న ఉపాసన!

Upasana about her personal life

11:10 AM ON 28th October, 2016 By Mirchi Vilas

Upasana about her personal life

మనిషికి ఒకవైపే కాదు రెండోవైపు చూడాలంటారు కదా. ఆ లెక్కన చూస్తే, అపోలో లైఫ్ మేనేజింగ్ డైరెక్టర్, బీ పాజిటివ్ మేగజీన్ ఎడిటర్, చారిటీ వర్కర్ వంటి బాధ్యతలు కూడా నిర్వహిస్తున్న ఉపాసన మనందరికీ మెగాస్టార్ కోడలు, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ భార్యగానే తెలుసు. కానీ ఉపాసన గురించి తెలుసుకోవాల్సింది చాలా ఉంది. అయితే మీడియాకు ఎప్పుడూ దూరమే. కానీ ఇన్నాళ్లకు ఉపాసన ఓ ఇంటర్వ్యూ ఇచ్చింది. తన లుక్స్, పిల్లలు, డైవర్స్ గాసిప్స్, కెరీర్.. ఇలా అన్నింటి గురించీ పూసగుచ్చినట్లు చెప్పేసింది. పెళ్లి సమయంలో ఉపాసన అందం గురించి చాలా కెమెంట్లు వచ్చాయనే విషయంపై ఈ ఇంటర్యూలో స్పందిస్తూ..

1/4 Pages

మా ఆయనకు చాలామంది గర్ల్ ఫ్యాన్స్ ఉన్నారు. వాళ్లంతా చరణ్ కు బాగా అందంగా ఉన్న అమ్మాయే భార్యగా రావాలని కోరుకున్నారేమో. అందుకే నన్నంతలా విమర్శించారు. అయినా నేను దాన్ని కాంప్లిమెంట్ గానే తీసుకుంటానని సమాధానం చెప్పింది. ఇక, పెళ్లి అయి ఇన్నిరోజులు గడుస్తున్నా పిల్లల్ని కనకపోవడానికి కూడా సమాధానమిచ్చింది.

English summary

Upasana about her personal life