చిరు 150వ చిత్రం హిట్ అవ్వాలని పూజలు చేస్తున్న ఉపాసన

Upasana doing poojalu for chiranjeevi 150th film

10:09 AM ON 2nd May, 2016 By Mirchi Vilas

Upasana doing poojalu for chiranjeevi 150th film

దాదాపు 8 సంవత్సరాలు తరువాత మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 150వ చిత్రం 'కత్తిలాంటోడు'. వివి వినాయక్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ఘన విజయం సాధించాలని ఆయన కోడలు, హీరో రామ్ చరణ్ తేజ్ భార్య ఉపాసన ప్రత్యేక పూజలు చేసింది. ఆదివారం అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయంలో పూజలు చేసిన ఆమెకు అర్చకులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. కొణిదెల ప్రొడక్షన్స్ పతాకం పై చరణ్ ఈ మూవీ నిర్మిస్తున్నాడు. కాగా అంతకుముందు ఈ చిత్ర దర్శకుడు వివి వినాయక్ తూర్పు గోదావరి జిల్లా అంతర్వేది లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో ఈ సినిమా కధను ఉంచి పూజలు చేసిన సంగతి తెలిసిందే. ఈ భక్తి సెంటిమెంట్ 'కత్తిలాంటోడు' చిత్రం సూపర్ హిట్ అవ్వడానికి ఉపయోగపడుతుందా? లేదా చూడాలి.

English summary

Upasana doing poojalu for chiranjeevi 150th film. Chiranjeevi daughter in law Upasana doing poojalu for to get 150th film success.