చెర్రీని ఉపాసన 2 వారాలు ఎందుకు దూరం పెట్టింది?

Upasana giving variety treatment to Ram Charan

10:56 AM ON 17th June, 2016 By Mirchi Vilas

Upasana giving variety treatment to Ram Charan

ఇదేదో వేరే యావ్వారంలా వుందే. అయినా దూరం పెట్టాల్సిన తప్పు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఎందుకు చేసినట్టు. మరి వివరాల్లోకి వెళ్ళాల్సిందే.. భార్య ఉపాసన రెండు వారాలపాటు దూరంగా ఉండమని భర్తకు ఓ సలహా ఇచ్చింది. సెలఫోన్స్ తో సహా ఎలాంటి ఎలక్ట్రానిక్స్, డిజిటిల్ అప్లైయిన్స్ లేకుండా 'డిజిటెల్ డెటాక్స్' పాటించమంది. దీంతో భార్యాభర్తలిద్దరూ రెండు వారాలుగా మరో ప్రపంచంలో విహరిస్తున్నారు. ఎలక్ట్రానిక్స్, డిజిటల్ వస్తువులేకాదు, కనీసం సెల్ ఫోన్స్ కూడా వాడ్డంలేదు. ఈ ధెరపి చాలా అద్భుతంగా పనిచేస్తుందని దంపతులిద్దరూ చెప్తున్నారు.

ప్రతీ ఏడాదీ ఇలా ఉపాసన తన భర్తను ఈ ధెరపీకు తీసుకెళ్తుంది. ఈ సమయంలో ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కమ్యునికేట్ కూడా చేయకూడదు. ఈ రోజుల్లో సెల్ ఫోన్స్, ఎలక్ట్రానిక్ పరికరాలు లేకుండా రోజు గడవడమంటే విశేషమే. సెలబ్రెటీలకైతే ఇది మరీ కష్టం. అయితే, భార్య ఉపాసన కోరికకు విలువిచ్చి ఇలా ముందుకు వెళ్తున్నాడు చెర్రీ. ప్రస్తుతం రామ్ చరణ్ తన తాజా చిత్రం 'ధృవ' కోసం చాలా శ్రమిస్తున్నారు. ఇందుకోసం రెండు నెలల సమయం తీసుకుని 10 కేజీల బరువు తగ్గారు. బరువు తగ్గిన చరణ్‌ ని చూస్తూ చాలా మంది ఆశ్చర్యపోయారు. 'ధృవ' చిత్రాన్ని సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో గీతా ఆర్ట్స్‌ పతాకం పై అల్లు అరవింద్‌ నిర్మిస్తున్నారు.

ప్రస్తుతం ఈ చిత్రం టీమ్ అంతా కాశ్మీర్ కు వెళ్తున్నారు. అక్కడ రామ్ చరణ్, రకుల్ ప్రీత్ సింగ్ ల మీద సీన్స్ చిత్రీకరిస్తారు. అలాగే తెలుగు నేటివిటీ కోసం చిత్రం కథలో పూర్తి మార్పులు చేసినట్లు తెలుస్తోంది. తమిళం కన్నా తెలుగులో మరింత స్టైలిష్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కించాలని సురేంద్రరెడ్డి భావిస్తున్నారు. ఈ చిత్రాన్ని తమిళంలో విజయం సాధించిన 'తని ఒరువన్‌' కి రీమేక్‌ గా తీస్తున్న ఈ సినిమాలో రామ్‌ చరణ్‌ అథ్లెటిక్‌ దేహంతో కనిపిస్తాడు. సో ఉపాసన ట్రీట్ మెంట్ బానే పనిచేసింది.

English summary

Upasana giving variety treatment to Ram Charan