కొత్త కొత్తగా ... జత కలిసే ..

Upcoming Tollywood New Pairs

12:31 PM ON 12th March, 2016 By Mirchi Vilas

Upcoming Tollywood New Pairs

అది వంటకమైనా , సినిమా అయినా వెరైటీ గా , కొత్త గా ఉండాల్సిందే ... లేకపోతే అబ్బా ఎప్పుడూ పాతదేనా అంటూ నిట్టూరుస్తారు ... ఇక సినిమాల్లో కొత్త కొత్త జోడీలు ప్రేక్షకుల ముందుకు వస్తూంటే, ఆ మజాయే వేరు ... వాటి పై భారీ అంచనాలు ఏర్పడిపోతాయి ... ఎప్పుడా ఎప్పుడా అని ఎదురు చూస్తూ , తహ తహ లాడిపోతుంటారు అభిమానులు ... ఇప్పుడు అరడజనుకు పైగా కొత్త జోడీలు ప్రేక్షకులను కనువిందు చేయబోతున్నాయి.

ఈ సంవత్సరం మన ముందుకు రానున్న కొత్త జంటలను స్లయిడ్ షోలో చుడండి.

1/7 Pages

మహేష్ బాబు - ప్రణీత

సూపర్ స్టార్ మహేష్‌బాబు- ప్రణీత జంటగా తొలిసారి ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఇప్పటివరకు ప్రణీత పవన్‌కల్యాణ్‌, ఎన్టీఆర్‌ తదితరులతో కలిసి నటించినా, . మహేష్‌తో కలవడానికి ‘బ్రహ్మోత్సవం’ వరకు ఆగాల్సి వచ్చింది. మహేష్‌ కథానాయకుడిగా తెరకెక్కుతున్న ‘బ్రహ్మోత్సవం’లో ఏకంగా ముగ్గురు హీరోయిన్లు కనువిందు చేయబోతున్నారు. అందులో ఇప్పటివరకు మహేష్ తో కల్సి స్టెప్పు లేసిన సమంత, కాజల్‌లతో పాటు ప్రణీత కూడా కొత్తగా జత కట్టింది. ముగ్గురు భామలు మహేష్‌ సరసన ఎలా ఉంటారోనని ఎదురుచూస్తున్న అభిమానులకు ఇక కొత్తగా జోడీ కడుతున్న ప్రణీత ఎలా ఉంటుందోనన్న ఆతృత పెరిగిపోయింది. ఇక అభిమానులకు బ్రహోత్సవమే ..

English summary

New pairs will be going to attract audience in the upcoming movies .Kajal and Pawan Kalyan acting together for the first time in Sardar gabbar Singh movie and Mahesh babu and Praneeta to act for the first time in Brahmotsavam movie.