సంచలన ఆఫర్: జియో సేవలన్నీ అప్పటిదాకా ఫ్రీయేనట!

Upto march Jio services are free

12:56 PM ON 2nd December, 2016 By Mirchi Vilas

Upto march Jio services are free

4జి, నెట్ జోడించి జియో పేరిట రిలయన్స్ ఇచ్చిన ఉచిత సేవల ఆఫర్ కి మిగతా మొబైల్ కంపెనీలు ఖంగు తింటే, ఇప్పడు మార్చి వరకూ పొడిగిస్తారన్న వార్తలను నిజం చేసూ, పొడిగింపు చేసారు. రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ మాట్లాడుతూ ఫేస్ బుక్, వాట్సాప్ కంటే వేగంగా జియో అభివృద్ధి చెందుతోందన్నారు. అత్యంత వేగంగా సాంకేతికతను అందించే సంస్థగా జియో నిలవడం గర్వకారణమన్నారు. ఇది తమ ఖాతాదారుల విజయమన్నారు. జియోను ఆదరించిన ప్రతి ఒక్కరికీ రుణపడి ఉంటామని, వీరి కోసం వచ్చే ఏడాది మార్చి 31 వరకు జియో అన్ని సేవలు పూర్తి ఉచితంగా అందించనున్నట్లు అంబానీ తెలిపారు.

జియో న్యూ ఇయర్ ఆఫర్ పేరుతో ఈ సేవలను పొడిగిస్తున్నట్లు చెప్పారు. డిసెంబర్ 31 నుంచి వంద నగరాల్లో ఇంటికే జియో సరఫరా చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన వివరించారు. ఇక ఆయన ప్రసంగంలో చోటుచేసుకున్న అంశాలు...

1/13 Pages

1. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 10 డిజిటల్ దేశాల్లో భారత్ ఒకటి. గడిచిన మూడు నెలలుగా రోజుకు 6లక్షల మంది చొప్పున జియోలో చేరారు.

English summary

Upto march Jio services are free