మీడియా ముందు ఏడ్చేసిన ఊర్వశి రౌతేలా

Urvashi Rautela get emotional for Great Grand Masti piracy

10:48 AM ON 18th July, 2016 By Mirchi Vilas

Urvashi Rautela get emotional for Great Grand Masti piracy

అవునా, అంటే అవుననే చెప్పాలి. హీరోయిన్ ఊర్వశి రౌతేలా ఇలా కన్నీళ్లు పెట్టుకోవడానికి పెద్ద కారణమే ఉంది. బాలీవుడ్ లో ఎన్నో అంచనాల మధ్య సినిమా 'గ్రేట్ గ్రాండ్ మస్తీ' రూపొందింది. మస్తీ సిరీస్ లో మొదటి రెండు సినిమాలు బ్లాక్ బస్టర్స్ కావడంతో, ఇక ఈ మూవీపై కూడా భారీ అంచనాలే ఉన్నాయి. అయితే రిలీజ్ అనుకున్న డేట్ కి 17 రోజుల ముందే ఈ మూవీ లీక్ కావడంతో భారీ నష్టమే వచ్చిందట. తొలి రోజున కనీసం 15 కోట్లు కలెక్షన్స్ వస్తాయనుకుంటే, 2 కోట్లకు పరిమితమైంది. దీంతో ఓ ప్రెస్ మీట్ పెట్టి మరీ యూనిట్ తమ బాధ వెళ్ల బోసుకుంది. హీరోయిన్ ఊర్వశి రౌతేలా అయితే ప్రెస్ మీట్ లోనే కన్నీరు కార్చేసింది.

బాలీవుడ్ లో ఇలా పైరసీ జరగడం బాధాకరం. ఉడ్తా పంజాబ్ కి ఏం జరిగిందో నాకు తెలుసు. అప్పుడు చాలా బాధపడ్డా. కానీ నా సినిమాకి కూడా ఇలా జరుగుతుందని ఎప్పుడూ అనుకోలేదు. అది కూడా రిలీజ్ కి 17 రోజులు ముందే లీక్ అయిపోయింది. ఫేస్ బుక్ ట్విట్టర్ ఇన్ స్టాగ్రామ్, అన్నింటిలోనూ విపరీతంగా మెసేజ్ లు వచ్చాయి. సూపర్బ్ గా చేశారని ప్రశంసించారు. నాకు సంతోషించాలో బాధ పడాలో అర్ధం కాలేదు. ఇది హత్య చేయడం కంటే ఎక్కువ అంటూ ఈ భామ ఏడ్చేసింది. ఓ సినిమాని తీసేందుకు రక్తం.. చెమట.. కన్నీరు.. ఎన్నో ఒలికిస్తాం.

అలాగే మస్తీ అనేది బిగ్గెస్ట్ కామెడీ ఛాయిస్ ఆఫ్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ. ఈ లీక్ దెబ్బకి.. సుల్తాన్ లాంటి పెద్ద సినిమా తర్వాత వారంలో రిలీజ్ చేయాల్సి వచ్చింది. కనీసం థియేటర్లు కూడా దొరకని పరిస్థితి ఎదురైంది. భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితి ఏ సినిమాకి అయినా రావచ్చు.. ప్లీజ్ స్టాప్ ది పైరసీ అంటూ ఊర్వశి రౌతేలా తన గోడు వెళ్ల బోసుకుంది. ఇంత ఏడుపులో కూడా తనకు సినిమాలో అవకాశం ఇచ్చిన మేకర్స్ కు తోటి నటీనటులకు కృతజ్ఞతలు తెల్పడం కొసమెరుపు.

English summary

Urvashi Rautela get emotional for Great Grand Masti piracy