వామ్మో.. ఇదేంటంటూ మధ్యలోనే పారిపోయిన హీరోయిన్

Urvashi Rautela ran away from Great Grand Masti movie audition

10:52 AM ON 20th June, 2016 By Mirchi Vilas

Urvashi Rautela ran away from Great Grand Masti movie audition

సినిమాల్లో సీన్లు మరీ వల్గర్ గా వున్నా నటించడానికి కొందరు ఏమాత్రం వెనుకాడని రోజులివి. అయితే కొందరు మాత్రం ఇబ్బంది పడుతుంటారు. ఇక్కడ ఓ హీరోయిన్ మాత్రం ఏకంగా పారిపోయింది. వామ్మో... ఇదేం కథ.. మొత్తం బూతు బాగోతంలా ఉందే అంటూ బాలీవుడ్ సినిమా గ్రేట్ గ్రాండ్ మస్తీ హీరోయిన్ ఊర్వశీ రైతల్ పరుగు లంకించుకుంది. ఆడిషన్ కి వచ్చి మధ్యలోనే పారిపోయి పత్తాలేకుండా పోయిందట. అయితే, ఆమె హంగు.. పొంగు చూసిన డైరెక్టర్ ఇంద్రకుమార్, ఊర్వశి అయితేనే దీనికి కరెక్ట్ అనుకుని మూడునెలల పాటు ఆమె అడ్రస్ కోసం గాలించి.. ఒప్పించి మొత్తానికి సెట్ చేశాడట.

త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న అడల్ట్ రేటెడ్ సినిమా అయిన గ్రేట్ గ్రాండ్ మస్తీ 2013లో వచ్చిన గ్రాండ్ మస్తీ సినిమాకు సీక్వెల్. ఇటీవల రిలీజైన ఈ మూవీ ట్రైలర్ పూర్తిగా అశ్లీలత, అసభ్యతతో నిండిపోయింది. అయితే, డైరెక్టర్ మాత్రం ఇది అంత బూతు సినిమా కాదని, హారర్ బ్యాక్ డ్రాప్ లో తీసిన రొమాంటిక్-కామెడీ సినిమా అని సెలవిస్తున్నాడు. అయితే, ఈ సినిమా ట్రైలర్ కు మాత్రం హిట్స్ బానే పడిపోతున్నాయి. మొత్తానికి హీరోయిన్ పారిపోయిన సంగతి తెల్సి అంతా ఒకటే నవ్వులట. ఒకసారి ఆ ట్రైలర్ పై మీరు కూడా ఒక లుక్ వెయ్యండి.

English summary

Urvashi Rautela ran away from Great Grand Masti movie audition