ట్రంప్ దూకుడుకి అమెరికా కోర్టు బ్రేక్

US Judge obstruct Trump's immigration order

11:16 AM ON 30th January, 2017 By Mirchi Vilas

US Judge obstruct Trump's immigration order

అమెరికా అధ్యక్షుని వేగానికి కోర్టు బ్రేక్ వేసింది. సంచలన నిర్ణయాలతో అదరగొట్టేస్తున్న డోనాల్డ్ ట్రంప్ కి అమెరికా కోర్టు లో చుక్కెదురైంది. ఏడు ముస్లిం ఆధిక్య దేశాల వారు అమెరికా రాకుండా ట్రంప్ విధించిన ఆంక్షలను న్యాయస్థానం తాత్కాలికంగా నిలిపివేసింది. ట్రంప్ ఆదేశాలపై ది అమెరికన్ సివిల్ లిబర్టీస్ యూనియన్ శనివారం న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. దీనిపై అమెరికా డిస్ట్రిక్ట్ కోర్టు న్యాయమూర్తి యాన్ డొనెల్లి విచారణ నిర్వహించి ఈ ఆదేశాలు జారీ చేశారు. దీని ప్రకారం చట్టపరమైన దరఖాస్తు ఆమోదం, వీసాతో అమెరికాలో నివసించే శరణార్థులు, అమెరికాలో ప్రవేశించడానికి చట్టపరమైన అనుమతులు ఉన్న వ్యక్తులను పంపించి వేయడాన్ని తాత్కాలికంగా నిలిపివేశారు. దీంతోపాటు ఇప్పటి వరకు ప్రభుత్వ కొత్త ఆదేశాల కారణంగా అరెస్టైన వారి వివరాలు ఇవ్వాలని ఆదేశించారు.

శరణార్థుల హక్కుల ప్రాజెక్ట్ లీగల్ డైరెక్టర్ లీ గెలెర్ట్న్ ఈ కేసును వాదించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ఈ చట్టం కింద బాధితులైన వారితో మాట్లాడి అవగాహన కల్పిస్తాం. కనీసం వారు తిరిగి ఆ నరకంలోకి వెళ్లకుండా ఆపేందుకు ప్రయత్నిస్తాం’ అని పేర్కొన్నారు. మరి ట్రంప్ తన దూకుడు తగ్గిస్తారో జోరు మరింత పెంచుతారో చూడాలి.

ఇది కూడా చూడండి: ఇక రాబోయేవి బొద్దింక పాలు?

ఇది కూడా చూడండి: అది మెడా ... బొంగరమా(వీడియో)

English summary

US Judge had obstructed to the President Donald Trump's immigration order those who have already landed in the US with visas should not be sent back to their hometowns