అమ్మాయితో డేటింగ్ కి వెళ్లాలనుకుంటే ముందు ఇలా చేయండి..

Use these tips to invite a girl for date

11:24 AM ON 30th September, 2016 By Mirchi Vilas

Use these tips to invite a girl for date

డేటింగ్ కి వెళ్దామని కోరిక ఉంటే చాలదు. ఎందుకంటే ఇది మన ఆచారం కానే కాదు. అందుకే అసలు డేటింగ్ అనే కాన్సెప్ట్ పైన ఆ అమ్మాయికి ఇంట్రెస్ట్ ఉందో లేదో తెలుసుకోండి. మీరు కలిసినప్పుడు మీతో ఎలా ఉంటుందో గమనించండి. ఒకవేళ మిమ్మల్ని మంచిగా రిసీవ్ చేసుకుంటూ, మీతో క్లోజ్ గా మూవ్ అవుతుందంటే డేటింగ్ కి ఆహ్వానించవచ్చని తెలుసుకోండి. కాలేజీలో గాని, ఆఫీస్ లో గాని తనకు పక్కన కూర్చోడానికి ప్రయత్నించండి. కుదిరితే చిన్నచిన్న మాటలు మాట్లాడుకోండి.

లంచ్ టైంలో/బ్రేక్ టైంలో తనని కూడా ఆహ్వానించండి. తన ఇష్టాలను తెలుసుకోడానికి ప్రయత్నించండి. తనపై మీరు కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని ఆమెకు తెలియనీయకండి. ఆమెతో మాట్లాడుతున్నప్పుడల్లా కళ్ళల్లోకి కళ్ళు పెట్టే మాట్లాడండి. కాదని ఇంకేమైనా చూసారో.. మీకు నెక్స్ట్ మీటింగ్ ఉండదు.

1/10 Pages

డేటింగ్ కి ఆహ్వానించే రోజు నీట్ గా రెడీ అవ్వండి. టాప్ టు బాటమ్ అన్ని నీట్ గా ఉండేలా చూసుకోండి. ముఖ్యంగా చేతి గోర్లు, నీట్ షేవ్ మరువకండి. ఇస్త్రి చేసిన దుస్తులు ధరించండి. తనని కలిసినప్పుడు రోజులానే కలవండి. ఎక్కువ హడావిడి చేస్తే అక్కడినుండి తప్పించుకునే ప్రమాదం ఉంది. అడిగేటప్పుడు కూడా తనతో ఎవరు లేనప్పుడు అడగండి. పక్కన ఎవరైనా ఉంటే తను అసౌకర్యంగా ఫీల్ అయ్యి మీ ఇన్విటేషన్ ని రిజెక్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి.

English summary

Use these tips to invite a girl for date