ఫోన్ మెమరీ సరిపోవడం లేదా? అయితే ఇలా చేయండి...

Use these tips to manage phone memory

03:19 PM ON 11th August, 2016 By Mirchi Vilas

Use these tips to manage phone memory

ఈరోజుల్లో ప్రతి ఒక్కరి చేతిలో ఓ ఫోన్ ఉంటోంది. అది కూడా అన్ని ఆప్షన్లు వున్న ఫోనే. ఎందుకంటే సోషల్ మీడియా పోస్టింగ్ లకు, చాటింగ్ కి వీలుగా వుండే ఫోన్ కదా. ఇక ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ యూజర్లను స్టోరేజ్ స్పేస్ సమస్యలు ప్రధానంగా వేధిస్తున్నాయి. ముఖ్యంగా 4జీబి, 8జీబి ఇంటర్నల్ మెమరీ ఆప్షన్ లతో అందుబాటులో ఉన్న బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్ ఫోన్ లో ఈ సమస్య ప్రధాన అవరోథంగా ఉంది. ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ లలో స్టోరేజ్ స్పేస్ సమస్యలను అధిగమించేందుకు పలు చిట్కాలున్నాయి. వాటిని పరిశీలిద్దాం.

1/6 Pages

ఫోన్ యాప్స్ కు సంబంధించి క్యాచీని తొలగించటం ద్వారా ఫోన్ ఇంటర్నల్ స్పేస్ ఆదా అవుతుంది. క్లీన్ మాస్టర్, క్యాచీ క్లీనర్ వంటి యాప్స్ ఈ ప్రక్రియను సమర్థవంతంగా పూర్తి చేయగలవు. వాట్సాప్ అకౌంట్ లో నిత్యం అనేక మీడియా ఫైల్స్ షేర్ అవుతుంటాయి. వీటిని ఆటోమెటిక్ గా మీ వాట్సాప్ అకౌంట్ డౌన్ లోడ్ చేసుకుంటుంది. ఈ కారణంగా బోలెడంత మొబైల్ డేటా ఖర్చవటంతో పాటు ఆ ప్రభావం ఫోన్ ఇంటర్నల్ మెమరీ పై పడుతుంది.

English summary

Use these tips to manage phone memory