పనికిరాని పాకిస్థానీ పిఎమ్ ను అమ్మేస్తున్నారట

Useless Pakistani PM Nawaz Sharif for sale

10:25 AM ON 15th April, 2016 By Mirchi Vilas

Useless Pakistani PM Nawaz Sharif for sale

కాదేది కవితకనర్హం అని మహాకవి శ్రీశ్రీ అంటే, అమ్మకానికి ఏది అడ్డు కాదని కొందరు సెలవిస్తున్నారు. అందుకే అమ్మేయ్‌ గురు అని ఓ పాత సామాన్ల అమ్మకం వెబ్‌సైట్‌ అంటోంది. పాపం పాకిస్థాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్‌ తీరు కూడా ఎవరో ఓ నెటిజన్‌కు నచ్చనట్టు ఉంది. అందుకే ఏకంగా అమెరికన్‌ ఈ కామర్స్‌ వెబ్‌సైట్ 'ఈ బే' లో ఆయనను అమ్మకానికి పెట్టాడు. అమ్మకమంటే అలాంటి ఇలాంటి అమ్మకం కాకుండా షరీఫ్‌ పేరిట పెద్ద ప్రకటనే ఇచ్చాడు. 'పనికిరాని పాకిస్థానీ ప్రధానమంత్రి నవాజ్‌ షరీఫ్‌ను అమ్మేస్తున్నాం' అంటూ ఆయన ఫోటోను పెట్టి.. 66,200 పౌండ్ల(రూ. 62.41 లక్షల) వేలం ప్రాథమిక ధరగా నిర్ణయించాడు.

మరో ఆరు రోజుల్లో ఈ బిడ్డింగ్ ముగియనుంది. ఇక ప్రకటనలో ఇచ్చిన విస్తారమైన వివరణలో షరీఫ్‌ను ఎడాపెడా ఏకి పారేసాడు సదరు అమ్మకందారుడు. 'ఇప్పటికే వాడేసిన ప్రధాని షరీఫ్‌ను అమ్మేస్తున్నాం. ఇంక ఎంత మాత్రం మాకు అవసరం లేదు. ఈ అమ్మకం కోసం బాక్స్ కానీ ఇన్‌స్ట్రక్షన్స్‌ కానీ ఇవ్వబడవు. కొనుగోలుదారుడే వచ్చి కలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఐటమ్ అమ్మకందారుడు ఇంతవరకు టచ్ చేయలేదు. సెంట్రల్ లండన్‌ నుంచి ఐటమ్ ను కలెక్ట్ చేసుకోవచ్చు. కొనుగోలు పూర్తికాగానే పూర్తి చిరునామా తెలియజేస్తాం. కొనుగోలుదారుడే రవాణా ఏర్పాట్లు చేసుకోవాలి' అని ప్రకటనలో పేర్కొన్నాడు.

'ఈ ప్రొడక్ట్‌లో, దీని కుటుంబంలో జన్యుపరంగా లోపమున్నది. అవినీతితో భ్రష్టుపట్టినది. పని చేసే పరిస్థితిలో లేదు. ఎప్పుడూ పని చేయలేదు. పుట్టుకతోనే ఇది అవినీతితో లోపభూయిష్టమైనది. ఈ ప్రొడక్ట్‌ను కొంటే దీనిలాగే ఉండే షాబాష్‌ షరీఫ్‌(సోదరుడు)ను కూడా ఉచితంగా ఇచ్చేస్తాం. భావోద్వేగమైన ఉపన్యాసాలతో నాటకీయతతో మీకు మంచి వినోదాన్ని ఇది అందిస్తుంది' అని ప్రకటనలో స్పష్టం చేయడం విశేషం. మొత్తానికి వింత ప్రకటనలు, వింత చేష్టలు మితిమీరిపోతున్నాయి.

English summary

Useless Pakistani PM Nawaz Sharif for sale. Pakistan useless Prime Minister Nawaz Sharif for sale.