తిరుమలేశునికి నిత్యసేవలతో పాటూ జరిగే సేవలు, ఉత్సవాలు ఇవే..

Utsavas and Sevas that done in Tirumala

01:10 PM ON 22nd October, 2016 By Mirchi Vilas

Utsavas and Sevas that done in Tirumala

కలియుగ వైకుంఠుడు తిరుమలేశునికి నిత్యం అనేక సేవలు జరుగుతూ ఉంటాయి. వీటిల్లో భక్తులు పాల్గొని తరిస్తున్నారు. అయితే నిత్యసేవలతో పాటు ప్రత్యేక సేవలు జరుగుతాయి. ముఖ్యంగా కొన్ని పర్వదినాలు, ప్రత్యేక రోజులను పురస్కరించుకుని తిరుమలలో కొన్ని కార్యక్రమాలు నిర్వహించడం రివాజు. వాటి గురించి తెలుసుకుందాం..

1/10 Pages

1. తెప్పోత్సవం...


ఏటా ఐదు రోజులు చైత్ర మాసం(మార్చి)లో ఇది జరుగుతుంది. స్వామి వారు రోజూ సాయంత్రం వేళ పుష్కరిణిలో విహరిస్తారు. నాద స్వరం, మంత్రోచ్చారణ నడుమ స్వామి వారి విగ్రహాలను పడవలో ఉంచి పుష్కరిణలో విహరింపజేస్తారు. మొదటి రోజు స్వామి వారు శ్రీరామ, సీత, లక్ష్మణ, హనుమంతుడు సమేతంగా విహరిస్తారు. రెండో రోజు శ్రీకృష్ణ, రుక్మిణీ దేవి సమేతులై బోటులో విహరిస్తారు. చివరి మూడు రోజులు త్రయోదశి నుంచి పౌర్ణమి వరకు మలయప్ప(బాలాజీ) స్వామి వారు శ్రీదేవి, భూదేవీ సమేతంగా పుష్కరిణిలో విహరిస్తారు.

English summary

Utsavas and Sevas that done in Tirumala