పోలీస్‌స్టేషన్‌ను మసాజ్ సెంటర్ చేసిన ఎస్సై

Uttar Pradesh SI massage video goes viral in internet

11:17 AM ON 21st June, 2016 By Mirchi Vilas

Uttar Pradesh SI massage video goes viral in internet

పోలీసోళ్ళు తలచుకుంటే, యవ్వారం మామూలుగా వుండదు. లేటెస్ట్ గా టెంపర్ సినిమాలో చూసాం కదా. కొందరు పోలీసులు సిన్సియార్టిగా పనిచేసి డిపార్ట్ మెంట్ కి మంచి పేరు తెస్తుంటే, కొందరు మాత్రం అడ్డమైన పనులు చేస్తూ, అన్ని అవలక్షణాలు పుణికి పుచ్చుకుని, తమ బిహేవియర్ తో డిపార్ట్ మెంట్ పరువు తీస్తున్నారు. అలాంటిదే ఈ ఘటన కూడా. ఆ ఎస్ఐ పోలీస్స్టేషన్లో.. తాను ఓ బాధ్యత కల పోలీస్ అధికారినన్న విషయం మరచి వరస్ట్ గా బిహేవ్ చేశాడు. ఏకంగా పోలీస్ స్టేషన్లోనే నేరుగా ఒక మహిళతో బాడీ మసాజ్ చేయించుకున్నాడు. ఒంటిమీద కేవలం డ్రాయిర్ మాత్రమే ఉండగా ఆ మహిళ ఆ ఎస్ఐ బాడీకి రంజుగా మసాజ్ చేసింది.

మనోడు ఆమె మర్దన చేస్తుంటే ఎంచక్కా ఎంజాయ్ చేశాడు. ఇంతకీ ఇది ఎక్కడంటే, ఉత్తరప్రదేశ్లోని హర్దోయ్ పోలీస్ స్టేషన్లో ఎస్ఐ సంజయ్ యాదవ్ ఉద్యోగం చేసి అలిసిపోయానని భావించాడో ఏమోగాని పోలీస్ స్టేషన్లోనే నేరుగా ఒక మహిళతో బాడీ మసాజ్ చేయించుకున్నాడు. యాదవ్ బట్టలు తీసేసి కింద కుర్చోగా మహిళ ఆయిల్ తో బాడీ మొత్తం మసాజ్ చేసింది. ఈ తతంగం మొత్తం ఆమె మరిది ఎదురుగా కుర్చుని చూస్తూనే ఉన్నాడు. ఈ సంఘటనను చూసిన వాళ్లు చూసి ఊరుకుంటారా! వీడియో తీసి నెట్ లో పెట్టడంతో సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలో జోరుగా హల్ చల్ చేస్తోంది.

ఈ విషయాన్ని డీజీ సీరియస్ గా తీసుకుని.. విచారణ జరిపించి ఎస్ఐను సస్పెండ్ చేశారు. బాడీ మసాజ్ కు సంబంధించిన ఆయిల్ ను దేవ్రియా గ్రామానికి చెందిన ఒక మహిళ ప్రత్యేకంగా తయారు చేస్తుంది. దీంతో ఈమెను ఏకంగా స్టేషన్ కు రమ్మని ఆర్డర్ వేసి మరీ ఆమెతో మసాజ్ చేయించుకుని ఖుషి అయ్యాడు. చివరకు ఎస్ఐ సంజయ్ యాదవ్ జాబ్ పోగొట్టుకుని రోడ్డున పడ్డాడు.

English summary

Uttar Pradesh SI massage video goes viral in internet