పులిని బతికించడానికి కాదు.. చంపడానికి ఎంత ఖర్చు చేశారో తెలిస్తే షాకౌతారు!

Uttarakhand government spends 75 lakhs to kill the tiger

11:12 AM ON 21st October, 2016 By Mirchi Vilas

Uttarakhand government spends 75 lakhs to kill the tiger

వన్య ప్రాణి సంరక్షణ అంటారు కదా. వాటి రక్షణకు ఎంతైనా ఖర్చు చేయాలని కూడా చెబుతున్నారు కదా. అయితే ఇక్కడ భిన్నంగా జరిగింది. ఓ పులిని చంపేందుకు ప్రభుత్వం సుమారు కోటి రుపాయల వరకు ఖర్చు చేసిందట. నెలన్నర రోజులపాటు దాన్ని వెంటాడిన అటవీశాఖ సిబ్బంది, గ్రామస్థులు చివరకు దాన్ని కాల్చి చంపారు. వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరాఖాండ్ లోని కార్బట్ రిజర్వ్ ఫారెస్ట్ కు చెందిన ఓ పులి పరిసర గ్రామస్థులను కంటిమీద కునుకులేకుండా చేసింది. ఇద్దర్ని చంపి తినడనంతో పాటు ఐదుగుర్ని గాయపర్చింది. మ్యాన్ ఈటర్ గా మారిన ఈ పులిపై గ్రామస్థులు భయాందోళన వ్యక్తం చేశారు. దీంతో అధికార కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ మండిపడింది. ఆ రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తుండటంతో ఎట్టకేలకు ప్రభుత్వం స్పందించింది.

మూడేళ్ళ వయసున్న ఆడ పులి కోసం హెలికాప్టరు, డ్రోన్లతో పాటు ఏనుగులు, అటవీ కుక్కలను వినియోగించారు. అటవీశాఖ సిబ్బంది, గ్రామస్థులు కలిసి 45 రోజుల పాటు దాన్ని వేటాడారు. చివరకు బుధవారం అది వారి నుంచి తప్పించుకోలేకపోయింది. రామ్ నగర్ లో కనిపించిన ఆ పులిపై సుమారు 15 రౌండ్లు కాల్పులు జరిపారు. తీవ్రంగా గాయపడిన అది చెరకు తోటల్లోకి వెళ్ళి మృతి చెందింది. గురువారం చనిపోయిన పులిని గుర్తించిన స్థానికులు డప్పు వాయిద్యాల మధ్య దాని మృతదేహాన్ని ఉరేగించారు. ఈ పులిని హతమార్చేందుకు ఉత్తరాఖాండ్ ప్రభుత్వం రూ.75 లక్షలకుపైగా ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. అదండీ అసలు సంగతి.

English summary

Uttarakhand government spends 75 lakhs to kill the tiger