హనుమంతుని పై ఆ గ్రామానికి కోపమెందుకు?

Uttarakhand people will not worship Lord Anjaneya swamy

11:22 AM ON 8th July, 2016 By Mirchi Vilas

Uttarakhand people will not worship Lord Anjaneya swamy

భూత పిశాచాలను రూపు మాపి అందరికీ సంతోషం, ఆనందం కలిగించే దేవుడు హనుమంతుడు అంటే ఎవరికీ అతిశయోక్తి అనిపించదు. అందుకే సాధారణంగా పెద్దలకు గాని పిల్లలకు గాని భయం వేస్తే ఆంజనేయస్వామిని తలచుకోమంటారు. ఆంజనేయ విగ్రహం, ఆంజనేయ ఆలయం దుష్టశక్తుల నుంచి ఎన్నో భయంకరమైన ఆపదల నుండి ఊరిని రక్షిస్తుందని భావిస్తారు. అంతెందుకు, హనుమంతుని ఆలయం లేని ఊరు ఉండదంటే అతిశయోక్తికాదు. కొన్ని చోట్ల భారీ సైజు హనుమంతుని విగ్రహాలు కూడా పెట్టేస్తున్నారు. కానీ ఈ గ్రామంలో మాత్రం మీకు ఎక్కడా ఆంజనేయుడి గుడి కాదు కదా, ఆ పేరు కూడా వినబడదు. ఉత్తరాఖండ్ లోని ద్రోణగిరి గ్రామంలో భూటియా అనే జాతి నివసిస్తుంది.

వీళ్ళంతా ఆంజనేయుడిని తప్ప మిగతా దేవుళ్ళందరినీ పూజిస్తారట. ఒకవేళ గ్రామంలో ఎవరైనా ఆ స్వామి పేరు పలికినా, పూజించినా నేరంగా పరిగణించి, గ్రామ బహిష్కారం చేస్తారు. ఇంతకీ ఇలా ఎందుకు చేస్తున్నారంటే దీనికి ఓ కధ ఉందట. త్రేతాయుగంలో రామరావణయుద్ధ సమయంలో మూర్ఛిల్లిన లక్ష్మణుని కోసం హనుమంతుడు తెచ్చిన సంజీవని పర్వతం ఈ ద్రోణగిరి ప్రదేశంలోనే ఉండేదట. వాళ్ళు పూజించే ఈ గుట్టను హనుమంతుడు తీసుకెళ్ళేసరికి అతనిపై ఈ ఊరివాళ్ళు ద్వేషం పెంచుకున్నారు. అందుకే ఆంజనేయుడంటేనే వారికి మంట. అదీ కథ! మొత్తానికి ధైర్యానికి ప్రతీకైన హనుమాన్ ని ద్వేషించే గ్రామం కూడా ఉందంటే మరి ఆశ్చర్యమే కదా.

English summary

Uttarakhand people will not worship Lord Anjaneya swamy