ఉత్తేజ్‌ కూతురు ఎన్టీఆర్‌ కోసం

Uttej daughter acts in Janatha Garage movie

12:19 PM ON 6th January, 2016 By Mirchi Vilas

Uttej daughter acts in Janatha Garage movie

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ తాజా చిత్రం “ జనతా గ్యారేజ్‌ ”. ఎన్టీఆర్‌ కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కునున్న ఈ చిత్రం లో ఇప్పటికే మలయాళ స్టార్‌ మోహన్‌ లాల్‌ ను ఎన్టీఆర్‌ తండ్రిగా తీసుకోగా, మలయాళ హీరో ఫహద్‌ ఫాసిల్‌ ఓ ముఖ్యపాత్ర పోషించనున్నారు. తాజా కధనం ప్రకారం ఈ చిత్రంలో ఒక కీలక పాత్ర కోసం క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌ అయిన ఉత్తేజ్‌ కూతురు చేతనను తీసుకున్నట్లు తెలుస్తుంది. అదేనండి చిత్రం సినిమా లో ‘ కుక్క కావాలి ’ అని కామెడీ చేసిన పాప ఉంది కదా గుర్తుందా తనే చేతన. ఈ చిత్రం లో చేతన పాత్ర ఏమిటో ఇంకా తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఈమె పర్సా రమేష్‌ మహేంద్ర దర్శకత్వంలో తెరకెక్కనున్న ' షీ ' చిత్రంతో ప్రేక్షకులకు హీరోయిన్‌గా పరిచయం కానుంది.

English summary

Uttej daughter acts in Janatha Garage movie.