వావ్ అనుష్కను నమ్ముకుని 25 కోట్ల ఖర్చట...

UV Creations Lady Oriented Movie With Anushka

10:48 AM ON 5th August, 2016 By Mirchi Vilas

UV Creations Lady Oriented Movie With Anushka

హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలకు ప్రస్తుతం పెట్టింది పేరుగా నిలిచిన యోగా భామ అనుష్క తాజాగా ఓ మూవీ చేస్తోంది. ఈమె చేస్తున్న భాగమతి సినిమాకి సంబంధించిన ఓ హాట్ న్యూస్ ఇప్పుడు చక్కర్లు కొడుతోంది. టెక్నో థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ మూవీ బడ్జెట్ ఏకంగా 25 కోట్లట. హీరోయిన్ ఓరియెంటెడ్ గా రాబోయే భాగమతి సినిమాకి నిర్మాతలు భారీ రేంజ్ లో ఖర్చు పెడుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఫిల్మ్ నగర్ లో హాట్ న్యూస్ నడుస్తోంది. ఈ సినిమా కోసం ఇప్పటికే భారీ మహల్ సెట్ వేసి షూటింగ్ చేస్తున్నారు. ఈ సెట్ వేయడం కోసమే నిర్మాతలు కొన్ని కోట్లు ఖర్చు పెట్టారేంటబ్బా అనేది హైలెట్ అవుతోంది.

హై టెక్నికల్ వాల్యూస్ తో రూపొందుతున్న ఈ సినిమాకి పిల్ల జమీందారు ఫేమ్ అశోక్ డైరెక్టర్. టబు, ఆది పినిశెట్టి, ఉన్ని ముకుందన్ ఇంపార్టెంట్ రోల్స్ చేస్తున్నారు. ఇంతకు ముందు ప్రభాస్ తో కొరటాల శివ డైరెక్షన్ లో మిర్చి, శర్వానంద్ తో రన్ రాజా రన్ , గోపీచంద్ తో జిల్ మూవీలని నిర్మించిన వంశీ, ప్రమోద్ తమ యువి క్రియేషన్స్ బేనర్లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇంతకీ అసలు విషయం ఏమంటే, ఈ మూవీలో క్యామియో రోల్ లో ప్రభాస్ కనిపించనున్నాడట. మరి ఈ భారీ బడ్జెట్ తో రూపుదిద్దుకుంటున్న ఈ మూవీ ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి.

ఇవి కూడా చదవండి:ట్రైలర్ లో చెమటలు పట్టిస్తున్న కత్రినా(వీడియో)

ఇవి కూడా చదవండి:1990 తర్వాత పుట్టినోళ్లు శృంగారానికి దూరమవుతున్నారా?

English summary

Heroine Anushka Shetty was famous for lady oriented movies and she acted in some of the lady oriented movies and she got good result and now she was going to act in another Lady Oriented movie in UV creations banner.