నేలపై పడిన నక్షత్రాలు.. ఈ అరుదైన దృశ్యం ఎక్కడో తెలుసా?

Vaadhoo island in the Maldives

03:39 PM ON 30th September, 2016 By Mirchi Vilas

Vaadhoo island in the Maldives

ఆకాశంలో తారలు ఎంతో ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. మిణుకు మిణుకుమంటూ అల్లంత దూరాన ఉండే ఆ నక్షత్రాలు మన ఆనందాన్ని రెట్టింపు చేస్తాయి. గగనంలో నక్షత్రాల్ని చూస్తూ ఒక్కసారైనా వాటిని పట్టుకునే అవకాశం వస్తే చాలు అని అనుకునే వాళ్లు చాలా మందే ఉంటారు. దివి నుంచి భువికి ఒక్కసారి దిగి వస్తే చాలు తారలతో హాయిగా గడిపేద్దాం అంటూ ఊహల్లో తేలిపోతాం. కానీ వాస్తవానికి అది సాధ్యమయ్యే పనేనా..? అని నిరుత్సాహ పడిపోతుంటాం. అయితే ఈ నిరుత్సాహం ఆ తారలకు తెలిసిందో ఏమోగానీ మనపై కనికరించాయి. ఆకాశ వీధుల్లో విహరించాల్సిన నక్షత్రాలు సముద్ర తీరంలో వాలి మెరిసిపోతున్నాయి!

ఆ దృశ్యాన్ని చూస్తే ఎవరికైనా జన్మకిది చాలు అనిపించక మానదు. అంత అద్భుతమైన ప్రదేశం ఎక్కడుందో తెలుసుకోవాలని ఉందా? అయితే వెంటనే వివరాల్లోకి పోదాం..

1/5 Pages

మాల్దీవులు అంటే పర్యాటకానికి ఎలాంటి పేరుందో తెలుసు. అధిక సంఖ్యలో పర్యాటకులు విహార యాత్రకి అక్కడికి వెళ్తుంటారు. అక్కడ ఉండే ప్రకృతి అందాలు చూపరులను ఆకర్షిస్తాయి. అందులోనూ వాదూ దీవి అయితే ఇంకా బాగా ఆకర్షిస్తుంది. ఎందుకంటే నింగిలోని తారలన్నీ వాదూ దీవి తీరంలోనే ఉంటాయి. వాటిని చూడటానికి చాలామంది ఆసక్తిగా ముందడుగేస్తారు. అమావస్య నాడు అయితే వాదూ తీరం నక్షత్రాలతో మిలమిల మెరిసిపోతూ ఉంటుంది. ఇలాంటి దృశ్యాల్ని ఎవరు మాత్రం చూడకుండా ఉండటానికి ఇష్టపడతారు.

English summary

Vaadhoo island in the Maldives