దశాబ్దాల  తర్వాత ఎన్నికల బరిలో వైగో

Vaiko To Contest In Tamilnadu Assembly Elections After 20 Years

11:18 AM ON 18th April, 2016 By Mirchi Vilas

Vaiko To Contest In Tamilnadu Assembly Elections After 20 Years

తమిళనాట ఎన్నికల్లో ఎన్నో వింతలూ విడ్డూరాలూ చోటుచేసుకుంటున్నాయి. మరికొన్ని కీలక అంశాలు కనిపిస్తున్నాయి. ఇందులో ఎండీఎంకే పార్టీ అధినేత వైగో అంశం తీసుకుంటే, సుమారు రెండు దశాబ్దాల సుదీర్ఘ విరామం తర్వాత వైగో అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగుతున్నారు. తమిళనాడులోని ఎండీఎంకే పార్టీ ప్రధాన కార్యదర్శి వి. గోపాలస్వామిఈ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. కోవిల్‌పట్టి నియోజకవర్గం నుంచి వైగో అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఈ మేరకు గోపాలస్వామి శనివారం జరిగిన ఎన్నికల ప్రచారంలో ప్రకటన చేశారు. తాను ఈసారి ఎన్నికల బరిలోకి దిగుతున్నట్లు చెప్పారు. ఎండీఎంకే ఆదివారం విడుదల చేసిన 27 అభ్యర్థుల జాబితాలో కూడా వైగో పేరు కూడా ఉంది.

ఇవి కూడా చదవండి: టీడీపీలో మగాళ్లు లేరా: రోజా సవాల్‌

తమ నేత 20 ఏళ్ల తర్వాత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడం చాలా ఆనందంగా ఉందని పార్టీ సీనియర్‌ నేత ఒకరు తెలిపారు. ఎండీఎంకే పార్టీ పెట్టిన మూడేళ్ల తర్వాత 1996లో వైగో విలతికులం అనే నియోజకరవర్గం నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి డీఎంకే అభ్యర్థి కె.రవిశంకర్‌పై 634 ఓట్ల స్వల్ప తేడాతో ఓడిపోయారు. అదే ఏడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కూడా ఓడిపోయారు. అప్పటి నుంచి వైగో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడం లేదు. 1998, 1999ల్లో లోక్‌సభ ఎన్నికల్లో గెలుపొందినప్పటికీ వైగో అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం పోటీ చేయడం లేదు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో వైగో విరుద్‌నగర్‌ నియోజకవర్గం నుంచి ఓడిపోయారు.

ఇవి కూడా చదవండి:

డ్రింక్స్ తాగే ముందు ఛీర్స్ ఎందుకు కొడతాం.?

పూరీ పై 'లోఫర్' దాడి

English summary

MDMK Party Leader Vaiko was contesting in Tamilnadu Assembly elections after a long gap after 20 years.