వైశాఖం ఫస్ట్ లుక్ వచ్చేసింది

Vaishakam movie first look

11:55 AM ON 1st June, 2016 By Mirchi Vilas

Vaishakam movie first look

చంటిగాడు, గుండమ్మగారి మనవడు, లవ్లీ చిత్రాల దర్శకురాలు బి. జయ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం వైశాఖం ఫస్ట్లుక్ పోస్టర్ విడుదలైంది. ఆర్.జె. సినిమాస్ పతాకం పై బి.ఎ.రాజు నిర్మిస్తున్న ఈ చిత్రంలో హరీష్(ప్రేమ ఇష్క్ కాదల్ ఫేమ్), అవంతిక హీరో హీరోయిన్లుగా నటించారు. ఈ సందర్భంగా బి. జయ మాట్లాడుతూ 60 శాతం చిత్రీకరణ పూర్తైంది. ఇప్పటివరకు ఎవ్వరూ చూపించని లొకేషన్లలో సినిమా చేయాలని కజకిస్థాన్లో షూట్ చేశాం. తొలిసారిగా కెమెరా విభాగంలో రోబొటిక్ టెక్నాలజీ వాడుతున్నాం. గత సినిమాల్లానే వైశాఖం కూడా తెలుగు ప్రేక్షకులకు నచ్చుతుంది అని అన్నారు. త్వరలో ఈ సినిమా పాటలు, ట్రైలర్ రిలీజ్ చేస్తామని నిర్మాత తెలిపారు. ఈ సినిమాకి సంగీతం: డి.జె. వసంత్, కెమెరా: సుబ్బరావు, డాన్స్: శేఖర్ మాస్టర్.

English summary

Vaishakam movie first look