వాజ్ పేయి హయాంలో మోసపోతే.. మోడీ హయాంలో సత్తా చాటామా!

Vajpayee and Modi

05:00 PM ON 1st October, 2016 By Mirchi Vilas

Vajpayee and Modi

పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీరులోకి చొరబడి ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేయడంతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై ప్రశంసల జల్లు కురుస్తోంది. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సైతం ప్రశంసకుల్లో ఒకరిగా మారిపోయారంటే సర్కారు సాధించిన విజయం సాధారణమైనది కాదని అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఆనాటి ప్రధాని హయాం - ఈనాటి మోడీ హయాంతో చాలామంది సరిపోలుస్తున్నారు. పోఖ్రాన్ అణు పరీక్షల నిర్వహణకు పచ్చజెండా ఊపిన మాజీ ప్రధాన మంత్రి అటల్ బిహారీ వాజ్ పేయితో మోడీ సాహసాన్ని తూకం వేస్తున్నారు. కార్గిల్ సమయంలో నియంత్రణ రేఖను దాటవద్దని వాజ్ పేయి సర్కారు అప్పట్లో ఇండియన్ ఆర్మీకి ఆదేశాలిచ్చింది.

అయితే నరేంద్ర మోడీ ప్రభుత్వం ధైర్యసాహసాలతో పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీరులోని ఉగ్రవాద స్థావరాలపై విరుచుకుపడేందుకు అనుమతి ఇచ్చింది. నియంత్రణ రేఖను దాటి పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోకి చొచ్చుకెళ్ళి ఘన విజయం సాధించాయి. వాజ్ పేయి దాయాది దేశంతో స్నేహం కోసం ప్రయత్నించి పాక్ నమ్మకద్రోహానికి గురికాగా.. మోడీ మాత్రం మొదట్లో మిత్రత్వాన్ని కోరుకున్నా, సంక్లిష్ట పరిస్థితుల్లో చాణక్య నీతి ప్రదర్శించారని విశ్లేషకులు అంటున్నారు. అంతేకాదు ప్రపంచంలో పాక్ ని ఏకాకిగా మార్చడంలో మోడీ సర్కార్ చూపిన నైపుణ్యం అమోఘమని అంటున్నారు. జమ్ముకాశ్మీర్ యూరీ సెక్టార్ లోని ఆర్మీ స్థావరంపై ఉగ్రవాద దాడి నేపథ్యంలో పాకిస్థాన్ ను అంతర్జాతీయంగా ఏకాకిని చేయాలన్న మోడీ సర్కారు విధానానికి సార్క్ దేశాలు మద్దతు పలికాయి.

1/5 Pages

భారత్ కు రష్యా మద్దతు... పాక్ కి వార్నింగ్..


పాకిస్థాన్ కు రష్యా గట్టి హెచ్చరిక చేసింది. పాక్ భూభాగంలో ఉగ్రవాద తండాలను నిరోధించాలని స్పష్టంగా చెప్పింది. శుక్రవారం రష్యా విదేశాంగ శాఖ విడుదల చేసిన ప్రకటనలో భారతదేశానికి మద్దతుగా నిలిచింది. పాకిస్థాన్ భూభాగంలో ఉగ్రవాద సంస్థల కార్యకలాపాలను నిలిపేసే విధంగా ఆ దేశం సమర్థంగా చర్యలు తీసుకుంటుందని ఆశిస్తున్నట్లు పేర్కొంది. ప్రస్తుతం ఉన్న సమస్యల పరిష్కారానికి రాజకీయ, దౌత్యపరమైన విధానాలను అనుసరించాలని, ఉద్రిక్తతలను పెరగనీయవద్దని హితవు పలికింది.

English summary

Vajpayee and Modi