పెళ్ళిలో విలువైన వస్తువుల చోరీ

Valuable things theft in wedding in Peddapuram

02:35 PM ON 18th February, 2016 By Mirchi Vilas

Valuable things theft in  wedding in Peddapuram

అసలే మాఘమాసం , పెళ్ళిళ్ళ జోరు .. ఇంకేముంది ఏమాత్రం అజాగ్రత్తగా వున్నా, విలువైన వస్తువులు దొంగల పాలే. ఇందుకు తార్కాణంగా చోటుచేసుకుంది. తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం గౌరికోనేరు కాలనీలోని ముప్పన రామారావు వీవర్స్‌ కల్యాణ మండపంలో గురువారం రాత్రి భారీ చోరీ జరిగింది. పెద్దాపురానికి చెందిన కొమ్మన శివ ఇంట్లో వారి పెళ్లినికల్యాణమండపంలో నిర్వహించారు. రాజమండ్రికి చెందిన ఇనుమర్తి లక్ష్మి కుటుంబసభ్యులతో సహా వివాహానికి హాజరయ్యారు. బుధవారం రాత్రి విడిదిగదిలో నిద్రిస్తుండగా, ఆమె బ్యాగులో భద్రపరిచిన సుమారు రూ.4లక్షల విలువైన 16 కాసుల బంగారు నగలను గుర్తు తెలియని దుండగులు ఎత్తుకెళ్లారు. గురువారం ఉదయం లక్ష్మి బ్యాగు తెరిచి చూడగా బంగారు ఆభరణాలు కనిపించలేదు. పెద్దాపురం పోలీసులకు ఫిర్యాదు చేయగా ఎస్సై సతీశ్‌ ఘటనాస్థలానికి చేరుకొని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

English summary

According to hindu's Maghamasam is the season of marriages and in this season soo many people will do marriages.Recently a thief in East Godavari District cashed this season.In a marriage in Peddapuram a thief theft 4 lakh valuable gold from a womans bag during the marriage.Police filed a case on this incident and started investigation on this incident.